నమాజ్ చేస్తుంటే కళ్లముందుకు వచ్చి కన్ను కొట్టి డిస్టర్బ్ చేస్తుందట

-priya-prakash-varrier-disturbing-muslim-youthకన్ను కొట్టి కుర్రకారుకి నిద్రలేకుండా చేసి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ చిక్కుల్లో పడింది. ఆమెకు వ్యతిరేకంగా ఒక ముస్లిం మత పెద్ద ఫత్వా జారీచేశారు. నమాజ్ చెయ్యడానికి కళ్ళు మూసుకుంటే ఆమె హవాభావాలు గుర్తొచ్చి ముస్లిమ్ యువత నమాజ్ మీద మనసు లగ్నం చేయలేకపోతున్నారని వారి ఆరోపణ.

ADVERTISEMENT

అది వారి సెంటిమెంట్లను దెబ్బ తీస్తుందని వారు అంటున్నారు. మరోవైపు ముస్లిం మనోభావాలను కించపరుస్తూ సినిమా తెరకెక్కించారంటూ మలయాళ చిత్రం ‘ఒరు అదర్‌ లవ్‌’ దర్శకుడు ఉమర్‌లూలూపై హైదరాబాద్‌ ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు కొందరు యువకులు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దాన్ని పరిశీలన కోసం ఉన్నతాధికారులకు పంపించారు.

మలయాళంలో తెరకెక్కిన ‘ఒరు అదర్‌ లవ్‌’లోని ‘మణిక్య మలరయ’ అనే పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పాటలో ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ పలికించిన హావభావాలను యువత మొత్తం ఫిదా అయిపోయింది. సోషల్‌ మీడియాలో ఆమె ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయింది. ఆమె ఇంస్టాగ్రమ్ అకౌంట్కు ఇప్పటికే లక్షల్లో ఫాలోవర్లు వచ్చిపడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories