గత కొన్ని రోజులుగా బీజేపీ టార్గెట్ గా ముఖ్యంగా మోడీ కార్నర్ గా ఢిల్లీ వేదికగా జరుగుతున్న కాక్రోచ్ల రాజకీయం, కాంగ్రెస్ రాజకీయం గమనిస్తే వీరిద్దరి వెనుక కంటికి కనిపించని ఎదో బలమైన అదృశ్య శక్తి దాగుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
అయితే నాటి నీట్ ఉద్యమం తరువాత వెలుగులోకి వచ్చిన కొన్ని వార్తలు ఆ వాదనకు బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయి. నిరసనల పేరుతో, ఉద్యమాల రూపంతో సీజేపీ, కాంగ్రెస్ చేపడుతున్న కార్యక్రమాలు, భారత ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలు, మోడీ సర్కార్ పై ఎక్కుపెడుతున్న ఆరోపణలు…అందుకు వారికీ లభిస్తున్న విదేశీయుల మద్దతు బేరీజు వేస్తుంటే ఈ నిరసనల వెనుక, ఉద్యమాల ముందు ఇండి కూటమి యాంటీ ఇండియా రాజకీయం చేస్తుందా అంటున్నారు బీజేపీ మద్దతుదారులు.
తాజాగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ తో ఢిల్లీ జంతర్ మంతర్ కేంద్రంగా కాంగ్రెస్, సీజేపీ చేపట్టాలని చూసిన ఉద్యమానికి, చేసిన నిరసన కార్యక్రమాలకు వినూత్నంగా విపక్షాలకు బాంగ్లాదేశ్ నుంచి మద్దతు లభించింది. ఇండియా లో ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు, భారత సీఈసీ రాజీనామా కోసం సీజేపీ చేస్తున్న డిమాండ్లకు మద్దతుగా బంగ్లాలో ఇస్లామిస్ట్ & లెఫ్ట్ వింగ్ పార్టీ నేతల రోడ్ల మీదకొచ్చారు.
ఇక అలాగే భారతదేశ చిరకాల ప్రత్యర్థి పాక్ నుంచి కూడా ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశించి “ఢిల్లీ పోలీసులు టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తారని ఆశిస్తున్నా” అంటూ రాసుకొచ్చారు.
దేశ రాజధానిలో పరిస్థితులు ఇంత ఉద్రిక్తంగా మారడం, దేశంలో ఎదో అలజడి జరుగుతుంది అనే భావన కలిగిలే నిత్యం రోడ్ల మీద నిరశనకారులు, పోలీసులు గుముగూడడం, నాటి బంగ్లా మాదిరి, నేపాల్ మాదిరి ఇండియా లో కూడా ప్రజా వ్యతిరేకతతో అధికార మార్పు జరగబోతుందా అనేలా పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చడం వెనుక యాంటీ ఇండియా రాజకీయం దాగుందా.?
దేశ ప్రజల ఓటు హక్కు భద్రత కోసం అంటూ విపక్షాలు చేస్తున్న ఉద్యమాలకు, నిరసనలకు దేశంలోని ప్రజలు మద్దతు కావాలి, ఇక్కడ రాజకియ పార్టీల సహకారం ఉండాలి అంతే కానీ భారత అంతర్గత రాజకీయాల మీద విదేశీయుల స్పందన, వారి మద్దతు అంటే అది అనేక అనుమానులకు తావిచ్చినట్టే అవుతుందిగా…!




