స్థానిక ఎన్నికలు: కూటమి ఐక్యతకు ‘తులాభారం’ కానున్నాయా.?

AP Local Elections: Chandrababu, Pawan Kalyan and BJP Face Alliance Unity Test

2024 ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కట్టిన రాజకీయ’కూటమి’ 2024 ఎన్నికలలో ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో మూడు పార్టీల నేతలు చూసారు, దాని తాలూకా ఫలితాలను కూడా నేడు నేడు పార్టీల నేతలు అనుభవిస్తున్నారు.

ADVERTISEMENT

అలాగే151 సీట్లతో అధికారంలో ఉన్న వైసీపీని 11 కి తెచ్చి కనీసం ఆ పార్టీకి కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసింది. మాజీ ముఖ్యమంత్రిని ఒక్కసారిగా ఒక నియోజకర్గ స్థాయికి పరిమితం చేసింది. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు ఆ స్థాయి విజయాన్ని అందుకోవడంలో నాయకుల కన్నా కార్యకర్తలదే పాత్రే అత్యంత అధికం.

అయితే నాటి నుంచి నేటి వరకు గ్రౌండ్ స్థాయిలో ఈ మూడు పార్టీల మధ్య కొన్ని విభేదాలు, వివాదాలు ఉన్నప్పటికీ అధినాయకత్వం స్థాయిలో మాత్రం ఈ కూటమి మరో పదిహేనేళ్ళు ఇలానే కొనసాగాలనే ఒక దృఢమైన ఆశయం కనిపిస్తుంది.

అయితే వారి ఆశయానికి తగ్గట్టే క్షేత్ర స్థాయిలో పరిస్థితిలు ఉన్నాయా.? మూడు పార్టీల క్యాడర్ ఇప్పటికి ఒక్కటిగా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారా.? అందుకు నాయకుల సహకారం ఉంటుందా.? వారి నాటి ఆ ఐక్యత 164 సీట్లతో కూటమికి తిరుగులేని విజయాన్ని తెచ్చిపెట్టింది.

మరి ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి పార్టీలు అదే స్థాయి ఫలితాలను రాబట్టగలవా.? మూడు పార్టీల నేతలు ఐక్యతగా కూటమి విజయం కోసం వైసీపీ తో పోరాటం చెయ్యగలవా.? లేదా తమ తమ అంతర్గత యుద్ధాలతో కూటమి ఐక్యతను బలహీనపరచనున్నాయా.? అనేది తెలుసుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికలు, వాటి ఫలితాలు కూటమి ఐక్యతకు ఒక ‘తులాభారం’ కానున్నాయి అనేది సుస్పష్టం.

అయితే నేడు సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ముగ్గురు నేతలు స్థానిక ఎన్నికలలో మూడు పార్టీల సీట్ల సర్దుబాటుకు సంబంధించిన కీలక అంశాల మీద చర్చించనున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేతగా బాబు జనసేన అధ్యక్షుడిగా పవన్ కూటమి మద్దతుదారులకు కూటమి గెలుపు తాలూకా అవసరాన్ని స్పష్టంగా ఉదాహరించారు.

ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో ఈ మూడు పార్టీల మధ్య సఖ్యత ఎలా ఉంది.? మూడు పార్టీల నాయకుల మధ్య సహకారం ఏ మేరకు సాగుతుంది.? మూడు పార్టీల కార్యకర్తల మధ్య ఐక్యత ఎంత దృఢంగా ఉంది.? వంటి కీలక విషయాల పై స్థానిక ఎన్నికల ఫలితాలు అధినేతలకు ఒక స్పష్టమైన సమాచారాన్ని అందించనున్నాయి.

ADVERTISEMENT
Latest Stories