నారాయణ… నారాయణా… డబుల్ ఇంజన్ సర్కారు అంటే ఇదా?

CPI Narayanaసీపీఐ సీనియర్ నేత నారాయణ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. కనుక ఏపీ, తెలంగాణలలో జగన్, కేసీఆర్‌ ప్రభుత్వాలపై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

బిజెపి అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు చేస్తానంటుంది. కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాలలో ఉన్నవి అవే కదా? అక్కడ కేసీఆర్‌, ఇక్కడ జగన్‌ ఇద్దరూ ప్రధాని నరేంద్రమోడీ కనుసన్నలలోనే, ఆయన చెప్పిన్నట్లే పనిచేస్తుంటారు. పార్లమెంటులో మోడీ ప్రభుత్వానికి ఎప్పుడు అవసరమైనా ఇద్దరూ మద్దతు ప్రకటిస్తుంటారు.

ADVERTISEMENT

మోడీని వ్యతిరేకించవలసి వచ్చినప్పుడు కూడా గోడ మీద పిల్లిలా తెలివిగా వ్యవహరిస్తుంటారు. బిఆర్ఎస్, వైసీపీ ఎంపీలు అందరూ మోడీ వెనుకే ఉంటారు కనుక ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో బిజెపి గెలిచినా ఓడినా దానికేమీ పెద్ద తేడా చేయదు. మోడీ, అమిత్‌ షాలు చెపుతున్న డబుల్ ఇంజన్ సర్కారులు ఇవే.

ఏపీ విషయానికి వస్తే, సాక్షాత్ ప్రధాని నరేంద్రమోడీ భూమిపూజ చేసిన అమరావతిని జగన్‌ సర్కార్ పక్కన పడేసినా కేంద్రం అందుకే పట్టించుకోవడం లేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా అందుకే పట్టించుకోవడం లేదు. విభజన హామీలలో భాగంగా ఏపీకి ప్రత్యేకహోదా, రైల్వే జోన్ ఇవ్వకపోయినా, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మేస్తున్నా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోదు. గట్టిగా అడగదు.

మోడీ కేసీఆర్‌, జగన్‌లను ఆడిస్తుంటే, వాళ్ళిద్దరూ ప్రతిపక్షాలను తమ గుప్పెట్లో పెట్టుకొని ఆడించాలని ప్రయత్నిస్తుంటారు. ఏపీలో వైసీపీ, బిజెపిలకు చెక్ పెట్టాలంటే, చంద్రబాబు నాయుడు బిజెపి చుట్టూ తిరగడం మానేసి, జనసేన, సీపీఐ, సీపీఎం ఇంకా కలిసి వచ్చే పార్టీలతో కూటమి ఏర్పాటు చేయాలి. ఈ చక్రబందం నుంచి బయటపడి ఏపీని చక్కబెట్టుకోవాలంటే ఇంతకు మించి వేరే దారి లేదు. చంద్రబాబు నాయుడు బిజెపిని వదిలి వస్తే సీపీఐ, సీపీఎంలు టిడిపితో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నాము,” అని నారాయణ చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories