రాజధాని నిర్మాణంలో మరో ‘కీలక’ అడుగు!

CRDA-DAmaravatiఅమరావతి నిర్మాణానికి గానూ ఏపీ సర్కార్ దాదాపు 33 వేల ఎకరాల భూమిని రైతుల నుండి సేకరించిన విషయం తెలిసిందే. ఇటీవల అట్టహాసంగా జరిగిన శంకుస్థాపన వేడుక తర్వాత సేకరించినటువంటి 33 వేల ఎకరాల భూమి చదును కార్యక్రమాలు మరియు రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అంతా భావించారు. అయితే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ను ప్రిపేర్ చేయడంలో ప్రభుత్వం నిమగ్నమైంది.

తాజాగా అమరావతి నిర్మాణానికి సంబంధించి కీలక అడుగు పడింది. ప్రభుత్వం సేకరించినటువంటి 33,000 ఎకరాల భూమిలో 12,590 ఎకరాలను సీఆర్డీఏకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి పూర్తి బాధ్యతలు సీఆర్డీఏకే నిర్దేశించినా, ఆ విధంగా అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదు. తాజా నిర్ణయంతో అమరావతి నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం సీఆర్డీఏకు అప్పగించినట్లయ్యింది.

తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలలోని తొలి దశ నిర్మాణానికి గుర్తించినటువంటి 12,590 ఎకరాల భూమి అప్పగింత తర్వాత జరగాల్సిన ప్రక్రియను వేగవంతం చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ మరియు సీసీఎల్ఏలకు ఆదేశించింది. ప్రభుత్వం అందజేసిన భూముల్లో నిర్మాణాలకు సంబంధించిన సమగ్ర ప్రణాలికలను 15వ తేదీ లోపున సిద్ధం చేస్తామని సీఆర్డీఏ తెలిపింది.

ADVERTISEMENT
Latest Stories