‘కమలం’ జెండా పట్టుకున్న సంచలన క్రికెటర్!

Cricketer-Sreesanth-Joined-BJPస్పాట్ ఫిక్సింగ్ కేసులో జైలు జీవితాన్ని అనుభవించడమే కాకుండా, నిషేధానికి కూడా గురై, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన క్రికెటర్ శ్రీశాంత్ తాజాగా రాజకీయాల బాట పట్టాడు. అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన శ్రీశాంత్ తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు చెప్తూ… ఎప్పట్లా తనపై ప్రేమ చూపించాలని కోరాడు.

బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని అన్నాడు. క్రికెట్ లో ఎలా ప్రతిభను నిరూపించుకున్నానో రాజకీయాల్లో కూడా అలాగే నిరూపించుకుంటానని, స్పాట్ ఫిక్సింగ్ కేసులో క్లీన్ చిట్ లభించడంతో తన రాజకీయ జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేదని శ్రీశాంత్ తెలిపాడు. తిరువనంతపురం నియోజకవర్గం నుంచి శ్రీశాంత్ బరిలో దిగుతాడని కేరళ బీజేపీ తెలిపింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories