సీరియల్ యాక్టర్ కేసు విజయవాడకు షిఫ్ట్!

Criminal case on -tv-actor-balaji on -kidney-donation భాగ్యలక్ష్మి అనే జూనియర్ ఆర్టిస్టును కిడ్నీ దానం విషయంలో నటుడు బాలాజీ మోసం చేసినట్టు ప్రాధమిక సాక్ష్యాలు లభ్యం కావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవాడలో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. తనను మభ్యపెట్టి కిడ్నీని తీసుకుని తన భార్యకు అమర్చుకున్నారని బాలాజీపై భాగ్యలక్ష్మి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

సినిమాలు, టీవీల్లో అవకాశాలతో పాటు 20 లక్షలు, ఆపై నెలకు 15 వేల సాయం చేస్తామని బాలాజీ చెప్పాడని, ఆపై పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. కేసును విచారించిన పోలీసులు న్యాయ సలహా తీసుకున్న అనంతం ఐపీసీ సెక్షన్ 420తో పాటు మానవ అవయవాల మార్పిడి చట్టం 1994లోని సెక్షన్ 19 ప్రకారం శిక్ష నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం విజయవాడకు బదిలీ చేశారు.

ADVERTISEMENT
Latest Stories