ఈమధ్యకాలంలో ఆల్మోస్ట్ ప్రతి సినిమాకి ప్రీమియర్లు వేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. కొన్ని సినిమాలకి ఆ ప్రీమియర్లు హెల్ప్ అయ్యి, బుకింగ్స్ పెరగ్గా.. ఇంకొన్ని మాత్రం మొదటి ఆటకే చతికిలపడ్డాయి.
ఉదాహరణకి.. “లిటిల్ హార్ట్స్” అనే సినిమాకి ప్రీమియర్స్ అత్యద్భుతంగా హెల్ప్ అవ్వగా.. “మిత్రమండలి” అనే సినిమాకి ఆ ప్రీమియర్ వేయడం పెద్ద మైనస్ గా మారింది.
అయితే.. ఇప్పుడు ఈవారం విడుదలవుతున్న “డెకాయిట్” విషయంలో నిర్మాత సుప్రియ మాత్రం ప్రీమియర్లు వేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడానికి తటపటాయిస్తున్నట్లు తెలుస్తోంది.
మూడేళ్ల వస్తున్న శేష్ సినిమా, మృణాల్ హీరోయిన్, ప్రమోషనల్ కంటెంట్ ఓ మోస్తరుగా పర్వాలేదనిపించుకుంది. అయితే.. మంచి ఓపెనింగ్స్ సంపాదించడానికి కావాల్సిన హైప్ మాత్రం లేదు.
అందుకే ప్రీమియర్స్ వేద్దామని సజెస్ట్ చేశాడు శేష్, అందుకు ఎందుకనో సుప్రియ మాత్రం ఎస్ చెప్పడం లేదు. దాంతో అటు ఓవర్సీస్ లో కానీ, ఇటు ఇండియాలో కానీ ఎలాంటి ప్రీమియర్స్ ను ప్రకటించలేదు.
సినిమా బిజినెస్ ను ఎన్నో ఏళ్లుగా గమనిస్తున్న సుప్రియకు ఒక ప్లానింగ్ ఉంటుంది, అన్నపూర్ణ సంస్థ నుంచి వచ్చిన సినిమాలు వేటికీ ఇప్పటిదాకా ప్రీమియర్లు వేయలేదు.
మరి సుప్రియ తన రెగ్యులర్ స్ట్రాటజీ కంటిన్యూ చేస్తూ “డెకాయిట్” ప్రీమియర్లు కూడా ఎవాయిడ్ చేస్తుందా, లేక శేష్ ఒప్పించి కనీసం తెలుగు స్టేట్స్ వరకూ ప్రీమియర్స్ వేయిస్తాడా అనేది రేపటికి క్లారిటీ వస్తుంది.






