ఇండియన్ సినిమా చరిత్రలో మొదటి 2000 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా ‘మిస్టర్ పర్ ఫెక్ట్’ అమీర్ ఖాన్ “దంగల్” చరిత్ర సృష్టించిందని ఇటీవల వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ప్రముఖ మేగజీన్ ఫోర్బ్స్ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ కధనాన్ని ప్రచురించింది. దీంతో ఇది అధికారిక వార్తగానే హల్చల్ చేసింది. కానీ తాజా సమాచారం మేరకు “దంగల్”కు 2000 కోట్ల క్లబ్ లో చేరిందన్న వార్త ఒక ఫేక్ న్యూస్ మాత్రమేనని, అంతేకాక ఈ సినిమా ఇక ఆ క్లబ్ లో చేరే అవకాశం లేదని తేలిపోయింది.
అమీర్ ఖాన్ ప్రతినిధి స్పందిస్తూ…. ‘దంగల్’ సినిమా ఇంకా 2,000 కోట్ల క్లబ్ లో చేరలేదని, చైనాలో విడుదలైన దంగల్ అద్భుత విజయం సాధించిందని, అయితే గత గురువారానికి మొత్తమ్మీద ‘దంగల్’ 1,864 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టిందిని స్పష్టం చేయడంతో, ఇండియాస్ ఫస్ట్ 2000 కోట్ల మూవీగా నిలిచే అవకాశం ‘బాహుబలి 2’కి దక్కిందని చెప్పవచ్చు. సెప్టెంబర్ లో చైనాలో విడుదల కాబోతున్న ఈ సినిమా 350 కోట్లు కొల్లగోడితే, ఆ రికార్డు ‘బాహుబలి 2’ సొంతమవుతుంది.



