దాసరి ‘కలం’కు బలి కానివారెవరు?

Dasari Narayana Rao - Biographyవర్తమానం నుండి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే… దర్శకరత్న దాసరి నారాయణరావు రాయబోతున్న ఓ పుస్తకం సంచలనాత్మకంగా నిలవబోతుందన్న సంకేతాలు స్వయంగా దాసరి నోట నుండే వెలువడ్డాయి. ఓ సినీ వేడుకలో ప్రసంగించిన దాసరి… గత మూడు, నాలుగు సంవత్సరాలుగా తాను ఓ పుస్తకం రాస్తున్నానని, ఇది పూర్తి కావడానికి మరో ఏడాదిన్నర్ర పడుతుందని చెప్పుకొచ్చారు.

దాసరి పుస్తకం రాస్తే అంత సంచలనం అవుతుందా… అంటే… సంచలనమైన అంశాలతో తాను పుస్తకం రాస్తున్నానని సెలవివ్వడమే ఇక్కడ అసలు ట్విస్ట్. సినీ పరిశ్రమలో గొప్ప వ్యక్తులుగా చెప్పుకుంటున్న కొందరి నిజమైన చరిత్రలు ఈ పుస్తకంలో ఉంటాయని దాసరి చెప్పడంతో అప్పట్లో చెలరేగిన అలజడి అంతా ఇంతా కాదు. దీంతో సదరు వ్యక్తులెవరు? దాసరి ఆ పుస్తకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారు? అన్న ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT

కానీ, దాసరి అకాల మరణంతో ఇక ఆ పుస్తకం తెరమరుగైనట్లే భావించవచ్చు. అయితే ఇప్పటికే ఎంతో కొంత రాసి ఉంటారు కాబట్టి, ఆ పుస్తకాన్ని కుటుంబ సభ్యులు ఎవరైనా బయటకు తీసుకువస్తారేమో చూడాలి. అసలింతకీ దాసరి బయట పెట్టాలనుకున్న ఆ వ్యక్తులు ఎవరు? ఇండస్ట్రీలో గొప్పవాళ్ళుగా చెప్పుకునే ఆ బడా సెలబ్రిటీల పేర్లేమిటి? ప్రస్తుతానికి వీళ్ళయితే సేఫ్..! ఆ పుస్తకం వచ్చే అవకాశం లేదు గనుక..!

ADVERTISEMENT
Latest Stories