విషమ స్థితిలో టాలీవుడ్ పెద్దాయన!

Dasari Narayana Rao Critically Illతెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు, చిన్న సినిమాల పాలిట దైవం అయిన ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు ఆరోగ్యం విషమించినట్లుగా తెలుస్తోంది. గత వారం రోజులుగా కిమ్స్ లో వైద్యం తీసుకుంటున్న దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితిలో, సోమవారం నాడు బాగా వ్యత్యాసం వచ్చిందని, అది మంగళవారం నాడు ఇంకా శృతిమించినట్లుగా సమాచారం. అధిక రక్తపోటుతో పాటు, కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకడంతో ప్రస్తుతం డయాలసిస్ పై వైద్యం అందిస్తున్నారు.

ఈ నెల 4వ తేదీన తన ఇంటిలో జన్మదిన వేడుకలను ఎంతో ఉల్లాసంగా జరుపుకున్న దాసరికి, 18వ తేదీన కిమ్స్ లో ఓ సర్జరీ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి విచ్చేయగా, అనారోగ్యం కారణంగా గత వారం రోజులుగా కిమ్స్ లోనే చికిత్స తీసుకుంటున్నారు. మరికొద్ది గంటల్లో డాక్టర్లు దాసరికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ను విడుదల చేయనున్నారు. దీంతో దాసరి ఆరోగ్యంపై ఎలాంటి సమాచారం అందిస్తారోనన్న ఉత్కంఠ, ఆందోళన సినీ వర్గాలలో నెలకొంది.

ADVERTISEMENT

కిమ్స్ లో చేరి వారం రోజులైనప్పటికీ మీడియా వర్గాలకు ఎలాంటి సమాచారం లేకపోగా, ఒక్కసారిగా ఆరోగ్యం విషమించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తొలుత జనవరి 19వ తేదీ నాడు విషమ పరిస్థితులలో కిమ్స్ చేరిన దాసరి, దాదాపుగా రెండున్నర్ర నెలల పాటు అక్కడే ఉండి చికిత్స చేయించుకున్నారు. చివరికి వెంటిలేటర్ స్థాయికి వెళ్ళిన దాసరి, విజయవంతంగా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చారు. దీంతో మళ్ళీ అలాగే ఇంటికి తిరిగి రావాలని సినీ వర్గాలు దైవాన్ని ప్రార్ధిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories