సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలకు సంబంధించి మొత్తం మూడు ఐటమ్స్ విడుదల కానున్నాయని సమాచారం లభించింది. ఒకటి ‘స్పైడర్’ టీజర్, రెండవది ‘భరత్ అనే నేను’ టైటిల్ లోగో, మరొకటి వంశీ పైడిపల్లి సినిమా టైటిల్ ప్రకటన. ఈ మూడు విడుదల అవుతాయన్న ఉత్సాహంలో ఉన్న ప్రిన్స్ ఫ్యాన్స్ కు దాసరి లేరన్న విషాదంతో మొత్తం ‘బంద్’ అయిపోయాయి. సూపర్ స్టార్ కృష్ణ కూడా తన వేడుకలను ఎక్కడా జరపవద్దంటూ అభిమానులకు పిలుపునిచ్చారు.
ఇక దాసరికి సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. తాజాగా ‘స్పైడర్’ టీజర్ కూడా విడుదలై యూ ట్యూబ్ రికార్డులను పగలకొట్టే పనిలో నిమగ్నమై ఉంది. ఇప్పటికే 1 మిలియన్ క్లిక్స్ ను అఫిషియల్ గా దాటేయగా, రియల్ టైంలో ఇదే సంఖ్య 2 మిలియన్ ఉందన్న విషయం బయటపడింది. అలాగే లైక్స్ విషయంలోనూ ‘బాహుబలి 2’ తదుపరి స్థానాన్ని ఇప్పటికే ఆక్రమించిన ‘స్పైడర్,’ ఈ విషయంలో ‘బాహుబలి 2’ రికార్డును బద్దలు కొట్టినా ఆశ్చర్యపడనవసరం లేదన్న విషయం స్పష్టమైంది.
‘స్పైడర్’ టీజర్ సంగతులు ఇలా ఉంటే, కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల కావాల్సిన ‘భరత్ అనే నేను’ టైటిల్ లోగో మరియు వంశీ పైడిపల్లి సినిమా టైటిల్ ప్రకటన గురించి పట్టించుకున్న వారే లేకపోయారు. దాసరి విషాదంతో అసలు ‘భరత్ అనే నేను మరియు వంశీ సినిమాల సంగతులు ‘అవుట్ ఆఫ్ సిలబస్’గా మారిపోయాయి. ఇక ‘స్పైడర్’ టీజర్ సృష్టిస్తున్న హంగామాతో ప్రిన్స్ అభిమానులకు కూడా మరో ఆలోచన లేకుండా పోయింది. ఆ ఇద్దరు దర్శకుడు ‘స్పైడర్’ టీజర్ పై స్పందించారు గానీ, తమ సినిమాల విషయం గురించి మాత్రం పెదవి విప్పలేదు.



