ఆ రెండూ పూర్తయితే దాసరి సంతోషించేవారేమో!

Dasari-Narayana-Rao-jayalalithaa biopic151 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ రికార్డులలో సైతం తన పేరును నమోదు చేయించుకున్న ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావుకు సినిమాలపై ఇంకా ఆకలి తీరలేదనే చెప్పాలి. ఈ వయసులోనూ ఇంకా సినిమాలకు దర్శకత్వం వహించాలని, ఇంకా సినిమాలను నిర్మించాలని తపన పడ్డ వ్యక్తి దాసరి. ముఖ్యంగా దాసరి కలలు కన్న ఆ రెండు ప్రాజెక్ట్ లు పూర్తయితే కాస్త సంతోషించే వారేమో!

అందులో ఒకటి… తన దర్శకత్వంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితకధ ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కించాలని దాసరి భావించారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. అయితే ఇంతలోనే దాసరి అనారోగ్యానికి గురి కావడంతో, గత అయిదు నెలలుగా ఈ సినిమాపై దృష్టి కేంద్రీకరించలేని పరిస్థితి నెలకొంది. దీంతో తన దర్శకత్వంలో జయలలిత జీవితగాధ పూర్తి కాకుండానే విశ్రమించారు.

ADVERTISEMENT

మరొకటి… తన బ్యానర్ లో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా నిర్మించాలని ఎంతో తాపత్రయపడ్డారు. దీనిపై కూడా చాలాసార్లు అధికారికంగా ప్రకటించారు, అలాగే చాలామంది దర్శకులతో చర్చలు జరిపారు. కానీ, ఇంతలోనే మృత్యువు చేరుకుంటుందని మాత్రం కనిపెట్టలేకపోయారు. ఒకటి దర్శకత్వం… ఒకటి నిర్మాణం… బహుశా ఈ రెండు ప్రాజెక్ట్ లు పూర్తయితే సినిమాల నుండి ‘రిటైర్మెంట్’ ప్రకటించి ఉండేవారేమో..!

ADVERTISEMENT
Latest Stories