కొత్త దాసరి నారాయణరావు వచ్చేసాడోచ్!

Dasari Narayana Rao - Master Dasari Narayana Rao TFI Latestఓ పక్కన మహనీయుడు భౌతిక దేహం… మరో పక్కన మీడియా పాయింట్ వద్ద ఎవడి గోల వాడిదిలా ఉంది. సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు సందడి చేస్తున్న మీడియా పాయింట్ వద్ద దాసరి నారాయణరావు పెద్ద కోడలు అంటూ ఓ మహిళ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు! ‘నేను దాసరి నారాయణరావు వారి పెద్ద కోడలిని… మాకు ఇంకా విడాకులు మంజూరు కాలేదు’ అంటూ మొదలుపెట్టిన ఆమె, తన మామ గారి మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది.

అయితే ఆమె వ్యాఖ్యలలోని అసలు ఉద్దేశం ఏమిటో కూడా పరోక్షంగా చెప్పకనే చెప్పింది. తన మనవడు అయిన మాస్టర్ దాసరి నారాయణరావును తెలుగు తెరకు పరిచయం చేయాలని ఇటీవల కోరగా, ఎంతోమంది సాయం చేశాను, మీకెందుకు అన్యాయం చేస్తాను, ఒక చిన్న ఆపరేషన్ ఉంది, ఆ తర్వాత కూర్చుని మాట్లాడదాం… అని దాసరి అన్నారని, ఇంతలోనే ఇలా జరిగింది… మామ గారి మరణంపై నాకు అనుమానాలున్నాయి అని చెప్పిన సదరు మహిళ, మాకేమీ ఆస్తిలో భాగం ఇవ్వలేదని ఆస్తిపాస్తుల గురించి ప్రస్తావించింది.

ADVERTISEMENT

ఇప్పటికే అర్ధమై ఉంటుంది… సదరు మహిళ వ్యాఖ్యలలోని ఆంతర్యం. వెళ్ళిపోయిన దాసరి స్థానంలో ‘మాస్టర్’ నారాయణరావును నిలబెట్టాలన్న తాపత్రయం! ఇక్కడ ఎవరిది న్యాయమో, ఎవరిది అన్యాయమో పక్కన పెడితే… ఓ లెజెండరీ వ్యక్తి పార్థీవ దేహాన్ని పక్కన పెట్టుకుని, ఏ మాత్రం చింతించకుండా, ఆస్తిపాస్తులంటూ, తన కొడుకును సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడమంటూ వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసం. ఇది తన గౌరవనీయులైన మామ గారిని అవమాన పరిచినట్లు కాదా? కుటుంబ కలహాలను చర్చించుకోవడానికి ఇదేనా వేదిక?

అంతే… కుటుంబ పెద్ద దిక్కు కోల్పోతే… అంబానీలకైనా అదే పరిస్థితి… అది చూసేవాళ్ళకైనా అదే పరిస్థితి..!

ADVERTISEMENT
Latest Stories