నేరాలు ఏపీలో…భద్రత తెలంగాణలో…ఇదేం ఖర్మ…?

Dastagiri

ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు అంటూ ఏ ముహూర్తాన వైస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నిజంగానే ఏపీ పోలీస్ వ్యవస్థ పై నామాంకం లేదంటూ పలు ఆరోపణలు కొనసాగుతూనే వస్తున్నాయి.

జగన్ ఆరోపణలు చేసిన తరువాత ప్రభుత్వం మారింది, ముఖ్యమంత్రి మారారు. అయినా ఆరోపణలు మాత్రం మారలేదు సరికదా మరింత ఎక్కువయాయ్యి. స్వయానా ముఖ్యమంత్రి సొంత బాబాయ్ కుమార్తె సునీతా రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో నాకు రక్షణ లేదంటూ తనకు రక్షణ కల్పించాలంటూ తెలంగాణ హైకోర్టు మెట్లెక్కారు.

ADVERTISEMENT

అలాగే తన తండ్రి హత్య కేసులో కూడా ఏపీలో న్యాయం జరిగే అవకాశం కనిపించడం లేదు, ఆ కేసును పక్క రాష్ట్రానికి బదిలీ చేయండి అంటూ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించి పక్క రాష్ట్రమైన తెలంగాణకు బదిలీ చేయించుకున్నారు సునీతా.

అలాగే వైస్ జగన్ సొంత చెల్లి వైస్ షర్మిల కూడా తనకు ఏపీలో రక్షణ రాలేదంటూ తనకు ప్రాణహాని ఉందంటూ పలుమార్లు బహిరంగానే అన్న ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాజాగా తన పై తన కుటుంబం పై వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న మానసిక దాడి పై కూడా హైద్రాబాద్ సైబర్ సెక్యూరిటీ లో ఫిర్యాదు చేసారు షర్మిల.

జగన్ డబ్బులిచ్చి ఒక సోషల్ మీడియా సైన్యాన్ని తన కుటుంబం పైకి వదిలారంటూ, అటువంటి వ్యక్తిగత విమర్శలు చేసి తన గౌరవ మర్యాదలను భంగపరుస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకున్నారు షర్మిల. ఇది నిజంగా జగన్ ప్రభుత్వానికి సిగ్గు చేటు.

గతంలో ఇదే షర్మిల పై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు అంటూ ఏపీ పోలీసులను ఆశ్రయించిన వైస్ కుటుంబం ఇప్పుడు సొంత అన్న పాలనలో ఉంటూ తన పై జరుగుతున్న సోషల్ మీడియా దాడిని అడ్డుకోవడానికి పక్క రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తుంది అంటే ఇది కచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి అవమానమనే చెప్పాలి.

ఇప్పుడు ఈ లిస్టులోకి మరో బాధితుడు వచ్చి చేరాడు. తనకు తన ప్రాణానికి, తన కుటుంబానికి ఏపీలో రక్షణ లేదంటూ తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు వైస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి. వివేకా కేసులో తానూ అప్రూవర్ గా మారడంతో వైసీపీ నేతల నుండి బెదిరింపులు ఎదురవుతున్నాయంటూ.., తనకు వైసీపీ ప్రభుత్వం నుండి ప్రాణ హాని ఉందంటూ…తనకు, తన ప్రాణానికి భద్రతా కల్పించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు దస్తగిరి.

ఇలా షర్మిల పై సోషల్ మీడియా దాడి జరుగుతుంది ఏపీ ప్రభుత్వం నుంచే…రక్షణ మాత్రం తెలంగాణలో…,అలాగే సునీతా రెడ్డి న్యాయం కోసం పోరాడుతున్న హత్య కేసు జరిగింది ఏపీ లో…పోరాడుతుంది తెలంగాణలోనే …, ఇప్పుడు దస్తగిరి ఎదుర్కుంటున్న బెదిరింపులు ఏపీ లోనే….ఆయన ఆశ్రయించి కూడా తెలంగాణ ప్రభుత్వాన్నే.

ఇలా కేసులు ఏపీలో…భద్రతా తెలంగాణలో…ఇదేం ఖర్మో అంటూ ప్రాణాల కోసం ఒకరు, ఆత్మ గౌరవం కోసం ఒకరు, న్యాయం కోసం మరొకరు ఇలా పక్క రాష్ట్రము వైపు చూస్తున్న వారంతా కూడా ఒకరకంగా వైసీపీ బాధితులే కావడం కొసమెరుపు.

ADVERTISEMENT
Latest Stories