ఢిల్లీలో మోడల్ ప్రియాంక కపూర్ ఆత్మహత్య!

delhi model priyanka suicideనెల రోజుల క్రితం వివాహమైన 25 ఏళ్ళ ప్రియాంకా కపూర్ అనే మోడల్ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ ఏరియాలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. మోడల్ గా రాణిస్తున్న ఈ భామ తన ఇంట్లో విగతజీవిగా పడివుండటాన్ని గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన 25వ తేదీ అర్ధరాత్రి తరువాత 26వ తేదీ తెల్లవారు జాములోపున జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ADVERTISEMENT

కాగా, కట్నం విషయంలో భర్త నితిన్ చావ్లా వేధింపులను తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరణించే ముందు ప్రియాంక రాసిన ఆత్మహత్య ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త చావ్లాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఇంతకుముందే ఓ వివాహం చేసుకున్న చావ్లా, మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ప్రియాంకను చేసుకున్నాడు. దక్షిణ ఢిల్లీలోని ఓ పబ్ ను నిర్వహిస్తూ ఉక్కు వ్యాపారాన్ని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories