విడుదల కానున్న ‘నిర్భయ’ కేసు నిందితుడు?

delhi nirbhaya gang rape minor rapist2012, డిశెంబర్ 16న కదులుతున్న బస్సులో ఒక యువతిపై ఆరుగురు అత్యంత దారుణంగా అత్యాచారానికి తెగబడడం… 15 రోజుల తర్వాత ఆ యువతి మృతి చెందడం… తెలిసిన విషయమే. ఈ కేసుకు ‘నిర్భయ’ అని నామకరణం చేసి, ఈ పాపానికి పాల్పడ్డ ఆరుగురిలో నలుగురికి కోర్టు ఉరి శిక్ష విధించింది. మరొకరు పోలీస్ కస్టడీలోనే మృతి చెందాడు. ఆరో వ్యక్తికి మైనార్టీ తీరకపోవడంతో అతనికి జూవనైల్ యాక్ట్ ప్రకారం మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించి జూవనైల్ హోం కు తరలించారు.

ఇక మహిళలు ధైర్యంగా స్వేఛ్చగా రోడ్డు మీద తిరగొచ్చు. మహిళల పట్ల వెధవ్వేషాలు, వేధింపులకు పాల్పడ్డ వాళ్ళ అంతు తేల్చిపారేస్తామని ప్రభుత్వాలు ఊదరగొట్టేశాయి. అయితే… అదే నిర్భయ చట్టం కేసులో శిక్ష పడ్డ ఒక బాల నేరస్థుడ్ని ప్రభుత్వం ఈ డిశెంబర్ 20న విడుదల చేయనుంది. అంతే కాదు, విడుదల అనంతరం ఆ బాలనేరస్థుడికి ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు పదివేల రూపాయల ఆర్ధిక సాయం, ఒక కుట్టుమిషనూ పెట్టుకునేందుకు ఢిల్లీ మహిళా శిశు సంక్షేమ శాఖ అతనికి పునరావాసం కల్పించనుంది.

నిర్భయ చట్టం కింద శిక్ష అనుభవించి విడుదల అవుతున్న నేపథ్యంలో అతన్ని రిసీవ్ చేసుకునేందుకు వచ్చే కుటుంబ సభ్యుల దారి ఖర్చులు కూడా చెల్లించాలని కోర్టు పేర్కొంది. అయితే నిర్భయ నేరస్థుణ్ని విడుదల చేసింది చాలక, అతనికి పునరావాసం కల్పించి, ఆర్ధిక సాయం కూడా అందించడం పై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నిర్ణయంతో ప్రజలకేం చెప్పదలుచుకుంటున్నారంటూ కొంత మంది ప్రశ్నిస్తున్నారు.

ఇటు కేంద్రం కూడా అతని విడుదల పై అభ్యంరతరాలు వ్యక్తం చేయడంతో రిలీజింగ్ ఆర్డర్ ను రిజర్వ్ డ్ లో ఉంచింది. జూవనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం బాల నేరస్థుడికి విధించిన శిక్ష ఈ నెల 20 తో పూర్తవుతుంది. కానీ, బాల నేరస్తుడి శిక్ష కొనసాగించాలన్న కేంద్రం వాదనతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవిస్తే… అతనికి శిక్ష పొడిగించే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories