పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన దేవిశ్రీప్రసాద్!

devi sri prasad about marriageసంగీత దర్శకుడిగా టాలీవుడ్ ను ఊపుతున్న దేవిశ్రీప్రసాద్, ఆదివారం నాడు జరగనున్న “నాన్నకు ప్రేమతో” ఆడియో వేడుకకు సిద్ధమవుతున్నవారు. ఓ చారిటీ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన దేవి, ఈ సందర్భంగా తన అంతరంగాలను ఎలక్ట్రానిక్ మీడియాతో పంచుకున్నారు.

“తనకు దక్కిన విజయమంతా తండ్రి వల్లేనని, నచ్చితేనే ఎవరితో అయినా పని చేస్తానని, లేకుంటే అసలు ఒప్పుకోనని, తానూ కంపోజ్ చేసిన ప్రతి పాట తనకు బాగా నచ్చినదేనని, దర్శకుడు సుకుమార్ తనను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ అండగా ఉంటారని” చెప్పిన దేవి, ఈ సందర్భంగా తన పెళ్ళికి సంబంధించిన విషయాలు కూడా బయటపెట్టారు.

“ప్రస్తుతం సింగిల్ గా చాలా హ్యాపీగా ఉన్నానని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవని” కుండబద్దలు కొట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా హీరోయిన్ ఛార్మితో దేవికి అనుబంధం ఉందని, ఇది పెళ్లి వరకు దారి తీస్తుందని వార్తలు హల్చల్ చేసిన నేపధ్యంలో దేవిశ్రీ ఇచ్చిన ప్రకటన ఊహాగానాలకు తెరదించింది.

ADVERTISEMENT
Latest Stories