పాత బంధాలతో కాంగ్రెస్ – కొత్త స్నేహాల కోసం బీజేపీ…?

Dhanush to Join Politics? BJP Link Sparks Speculation

దేశంలో బీజేపీ కూటమి ఎన్డీయే గత మూడు దఫాలుగా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసింది. అయితే ఇక భవిష్యత్ లో రానున్న ఎన్నికలలో కూడా తమ ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి బీజేపీ ఇప్పటి నుంచే రాజకీయం మొదలుపెట్టిందా.?

అందులో భాగంగా నే బీజేపీ తన కూటమిని మరింత పటిష్టం చేసుకునేందుకు కొత్త స్నేహాల కోసం వెతుకులాట మొదలుపెట్టిందా.? ప్రస్తుతం తమ పై ఉన్న రాజకీయ ఒత్తిడిని రాబోయే రోజులలో మరింత తగ్గించేలా బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతుందా.?

ADVERTISEMENT

ఇప్పటికే ఒకపక్క కాక్రోచ్ జనతా పార్టీ మరో పక్క కాంగ్రెస్ తన మిత్రపక్షాలు కలిసి బీజేపీ పార్టీ ని రాజకీయంగా ఇరకాటంలోకి నెడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రాహుల్ గాంధీ బీజేపీ పై దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్ చోరీ నినాదం నుంచి సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ వరకు ఇలా ప్రతి అంశం పై బీజేపీ టార్గెట్ గా ముందుకెళుతున్నారు.

అటు కాక్రోచ్లు సైతం బీజేపీ రాజకీయ ఆధిపత్యాన్ని అణిచేందుకు దేశ రాజధాని ఢిల్లీని వేదికగా ఎంచుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలా అయితే తన పట్టు నిలుపుకోవడానికి కొత్త స్నేహాల కోసం ఎదురుచూస్తుందో అలాగే కాంగ్రెస్ కూడా తన పాత బంధాలను కలుపుకుంటూ ముందుకెళ్లాలని ఆశిస్తుంది.

తమిళనాడులో టీవీకే అధినేత దళపతి విజయ్ ని తన దారికి తెచ్చుకునేందుకు బీజేపీ ఆడిన రాజకీయ క్రీడ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా, టీవీకే ను కాంగ్రెస్ కి మిత్రపక్షం గా మార్చింది. ఇటువంటి పరిస్థితిలలో తమిళనాడులో బీజేపీ తన పంతం నెరవేర్చుకోవడానికి మరో అస్త్రాన్ని సిద్ధం చేస్తుందంటూ ప్రచారం ఊపందుకుంది.

అయితే ఆ ప్రచారానికి హీరో ధనుష్ ఫ్యాన్ మీట్లు, అందులో ధనుష్ తన మహిళా అభిమానులకు అందించిన బహుమతులు, దాని పై ముద్రించిన చిహ్నాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తాజాగా తమినాడు రాజకీయాలలోకి హీరో ధనుష్ ఎంట్రీ అంటూ సాగుతున్న ప్రచారం, అందుకు ధనుష్ పెడుతున్న ఫ్యాన్ మీట్ సమావేశాలు ఆ ఊహలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

ధనుష్ మహిళా అభిమానుల సమావేశంలో ఆయన పంచిన వెండి దీపపు కుందే పై కమలం గుర్తు కనిపించడంతో టీవీకే విజయ్ కి పొలిటికల్ చెక్ పెట్టేందుకు AIADMK భుజం మీద నుంచి బీజేపీ ధనుష్ బాణం సంధించనుందా.? అంటూ ఊహాగానాలు ప్రచారంలో వచ్చేసాయి. అందులో భాగంగానే ధనుష్ కమలం గుర్తు తో ఉన్న దీపాలను బహుమతులుగా ఎంచుకున్నారా.?

అలాగే ఇటు జగన్ ను తిరిగి కాంగ్రెస్ తో మచ్చిక చేసుకునేందుకు రాహుల్ సైతం రాజకీయం మొదలుపెట్టారా.? అందుకో భాగంగానే జగన్ కు వ్యతిరేకంగా షర్మిల చేస్తున్న రాజకీయానికి చెక్ పెట్టెల కాంగ్రెస్ పావులు కదుపుతోందా.? అన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది.

ఇలా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికారం కోసం బీజేపీ కొత్త స్నేహాల వెతుకులాటలో, కాంగ్రెస్ పాత బంధాల అలమారికలతో ముందుకెళ్లాలని భావిస్తున్నాయా.?

ADVERTISEMENT
Latest Stories