‘జనగణమన’ సినిమాపై దిల్ రాజు స్పందన!

Dil Raju about mahesh babu janaganamana‘పోకిరి’ పూర్తయ్యి పది సంవత్సరాలు అయిన సందర్భంగా దర్శకుడు పూరీ జగన్నాధ్ “జనగణమన” పేరుతో ఒక సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఊహించని ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్ వర్గాల్లో సంచలనం సృష్టించగా, జాతీయ గీతాన్ని ప్రతిబింబించే ‘జనగణమన’ పేరుతో మహేష్ – పూరీ జగన్నాధ్ కాంభినేషన్లో సినిమా ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ADVERTISEMENT

అయితే ఈ ‘జనగణమన’ పేరుపై తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. గత రెండు సంవత్సరాల నుండి ఈ టైటిల్ తో తానూ ఒక సినిమాను నిర్మించే ఉద్దేశంతో రిజిస్టర్ చేసానని, అయితే, కొన్ని కారణాల వలన అది కార్యరూపం సిద్ధించుకోలేదని, ఇటీవల పూరీ జగన్నాధ్ ఫోన్ చేసి అడగడంతో ‘జనగణమన’ టైటిల్ ను ఇచ్చేసానని చెప్పుకొచ్చారు.

నేను ఎలాగూ సినిమా చేయట్లేదు కాబట్టి, పది సెకన్ల పాటు ఆలోచించి, ఈ టైటిల్ ను పూరీకి ఇచ్చేసానని దిల్ రాజు తెలిపారు. దీంతో ‘జనగణమన’ టైటిల్ ప్రకటనకు ముందు బ్యాక్ గ్రౌండ్ లో చాలా కధే నడిచిందని చెప్పుకోవడం ప్రిన్స్ అభిమానుల వంతయ్యింది.

ADVERTISEMENT
Latest Stories