అంత రిస్క్ నెత్తి మీద ఉన్నా దిల్ రాజు కు భయం లేదు

Dil Raju is not afraid even though he is on risky ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం ఆయన సతీమణి తో అమెరికా హాలిడే కు వెళ్లారు. అమెరికా ఇండియా నుండి రాకపోకలు బంద్ చెయ్యడానికి కొంచెం ముందు దిల్ రాజు అమెరికాలో వాలి పోయారు. ఇండియాలో పరిస్థితులు చక్కబడ్డాకే తిరిగి వస్తారట. అయితే దిల్ రాజు కు సంబంధించిన తెలుగు, హిందీ, తమిళంలో అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి.

తెలుగులో అరడజను సినిమాలు దాకా ఉన్నాయి. బాలీవుడ్ లో జెర్సీ రీమేక్ విడుదలకు సిద్ధంగా ఉంది. హిట్ సినిమా రీమేక్ పట్టాలెక్కించాలి. రామ్ చరణ్ – శంకర్ సినిమా కోసం ఇద్దరికీ అడ్వాన్సులు ఇచ్చేశారు. ఆ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. మరోవైపు తమిళ సూపర్ స్టార్ విజయ్ తో వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేస్తున్నారు.

ADVERTISEMENT

వంశీ పైడిపల్లి అతనిని ఒక స్క్రిప్ట్‌తో ఒప్పించగలిగాడట. ఈ ప్రాజెక్టుకు దిల్ రాజు విజయ్ కు 90 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు పుకార్లు ఉన్నాయి. దినీతో ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు 170 కోట్ల వరకు పెరుగుతుందని అంచనా. ఏ రకంగా చూసినా అన్ని వైపులా దిల్ రాజు కు రిస్క్ ప్రాజెక్టులే.

పైగా థియేటర్లు మూతపడటానికి కొంచెం ముందు దిల్ రాజు – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన వకీల్ సాబ్ విడుదలయింది. ఆ సినిమా కూడా లాస్ వెంచర్ గా ముగిసింది. ఆ సినిమాను చాలా చోట్ల దిల్ రోజునే పంపిణీ చేశారు. అయినా ఆయన ఇంత రిలాక్సడ్ గా హాలిడే కు వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ADVERTISEMENT
Latest Stories