అజ్ఞాతవాసి, స్పైడర్’ సినిమాల కంటే బెటర్ అంట!

Dil Raju - Srinivasa kalyanamటాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్లను నిలపడంలో ప్రిన్స్ “స్పైడర్” మరియు పవర్ స్టార్ “అజ్ఞాతవాసి” చిత్రాలు ఒక దానిని మించి మరొకటి పోటీపడ్డాయి. ఇది బహిరంగమే, అందరూ అంగీకరించే విషయం కూడా. అయితే ఈ రెండింటి కంటే మెరుగు తమ “శ్రీనివాస కళ్యాణం” అని, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రస్తావించడం విశేషం.

[m9ad]

ADVERTISEMENT

మా సినిమాకు తొలిరోజు డివైడ్ టాక్ వచ్చిన మాట వాస్తవమేనని, గురువారం రిలీజ్ కావడంతో శుక్రవారం నాడు కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయని, అయితే శనివారం నాటికి బాగా పుంజుకుని మార్నింగ్ షో నుండే హౌస్ ఫుల్స్ పడ్డాయని, మౌత్ టాక్ సరిగా లేకపోతే పెద్ద స్టార్ హీరోల సినిమాలైనా షో షోకు కలెక్షన్స్ దారుణంగా పడిపోతాయని, ఇందుకు అజ్ఞాతవాసి, స్పైడర్’ సినిమాలే నిదర్శనమని అన్నారు.

20 ఏళ్ళుగా ఒక డిస్ట్రిబ్యూటర్ గా తనకున్న అనుభవంతో ఇదంతా చెప్తున్నానని…. ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ తో కలిసి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సదరు అంశాలను ప్రస్తావించారు. కలెక్షన్స్ విషయం పక్కన పెడితే, ‘మౌత్ టాక్’లో ‘శ్రీనివాస కళ్యాణం’ ఆ రెండు పెద్ద సినిమాల కంటే బెటరా?

ADVERTISEMENT
Latest Stories