చిరుపై సంచలన వ్యాఖ్యలు!

Kodandarami Reddy, Kodandarami Reddy Chiranjeevi Controversy, Director Kodandarami Reddy Chiranjeevi Controversy, Kodandarami Reddy Megastar Chiranjeevi Controversy, మెగాస్టార్ ను అది దగ్గరగా చూసిన దర్శకులలో కోదండరామిరెడ్డి స్థానం ఎప్పుడూ నెంబర్ వన్నే. చిరును ఒక మాస్ స్టార్ హీరోగా నిలబెట్టిన అదే కోదండరామిరెడ్డి, మెగాస్టార్ 150వ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి.

చిరంజీవి ఇప్పుడు యాక్షన్‌, సందేశాత్మక సినిమాలు చేస్తే జనం నవ్వుకుంటారని, మెగాస్టార్ చిరంజీవి సందేశాలిస్తే ఇప్పటి ప్రేక్షకులు చూడరని, తానైతే చిరంజీవితో తాను సినిమా చేయాల్సి వస్తే కామెడీ సబ్జెక్టును ఎంచుకుంటానని తెలిపారు. చిరు నటిస్తున్న 150వ చిత్రం ఎలా ఉంటుందని అలానే ఉంటుందని విజయవాడలో రోటరీ క్లబ్ సమావేశంలో మీడియా వర్గాలు అడిగిన ప్రశ్నకు జవాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కోదండరామిరెడ్డి.

ADVERTISEMENT

అయితే ఉన్నట్లుండి చిరుపై కోదండరామిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడన్న దానిపై మెగా అభిమానులు ఆరా తీసే పనిలోపడ్డారు. ఇంకోవైపు ఆయన్ని వెనుక నుంచి ఎవరో నడిపిస్తున్నారని కోదండరామిరెడ్డిపై మెగా అభిమానులు మండిపడుతున్నారు. గతంలో చిరంజీవి- కోదండరామిరెడ్డి కాంబోలో చాలా సినిమాలు సూపర్‌హిట్ అయిన విషయమూ మెగా ఫ్యాన్స్ కు తెలిసిందే.

ఎక్కువ సినిమాలు ఒకే డైరెక్టర్‌తో తీసిన జాబితాలో ముందున్న ఈ డైరెక్టర్, చిరుపై అలాంటి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినా చిరు- కోదండరామిరెడ్డికి వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు. పొలిటికల్‌గా చిరు విఫలమయ్యారని, అందువల్ల ఆయన సందేశాత్మక చిత్రాలు తీస్తే జనం నమ్మరన్న కోణంలో కోదండరామిరెడ్డి ఈ కామెంట్స్ చేసి ఉండొచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories