‘మహేష్’ దర్శకుడికి ‘టీఆర్ఎస్’ అండదండలు!

director Vamsi-paidipalli-father joining trsప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తోన్న ప్రిన్స్ మహేష్ బాబు, తదుపరి చిత్రాలను కొరటాల శివ, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. కొరటాల శివ సినిమా ఇప్పటికే ప్రారంభం కాగా, వంశీ పైడిపల్లి సినిమా ఈ ఏడాది సెకండాఫ్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. మహేష్ కెరీర్ లో 25వ సినిమాగా సిల్వర్ జూబ్లీ చిత్రాన్ని తెరకెక్కించే అరుదైన అవకాశాన్ని వంశీ పైడిపల్లి సొంతం చేసుకోవడంతో, ఇటీవల కాలంలో ట్రేడ్ వర్గాల్లో వంశీ పేరు బాగా హల్చల్ చేసింది.

అయితే అదే వంశీ తండ్రి రవీందర్ రావు రాజకీయ వేత్త అన్న విషయం అందరికీ తెలియదు. ప్రస్తుతం టీ-పీసీసీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న రవీందర్ తాజాగా పదవికి రాజీనామా చేసారు. గతంలోనూ ఏపీపీఎస్పీ సభ్యుడిగా పనిచేసిన రవీందర్, ఈ నెల 29వ తేదీన గులాభీ కండువా కప్పుకోవడానికి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. అంటే ఇక నుండి దర్శకుడు వంశీ పైడిపల్లికి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అండదండలు పుష్కలంగా ఉండబోతున్నాయన్న మాట.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories