“డీజే” ఫస్ట్ డే రిజల్ట్!

Duvvada Jagannadham Firstday Openings‘హ్యాట్రిక్’ హిట్స్ తో మంచి ఊపులో ఉన్న స్టార్ హీరో అల్లు అర్జున్… ‘సక్సెస్ ఫుల్ ఫిల్మ్స్’కు కేరాఫ్ అడ్రస్ అయిన నిర్మాత దిల్ రాజు… పడిలేచిన కెరటంలా కెరీర్ ఉన్న హరీష్ శంకర్… ఈ ముగ్గురి కాంభినేషన్ లో రూపొందిన “దువ్వాడ జగన్నాధమ్” ధియేటర్లలో ప్రత్యక్షమై ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు తెచ్చుకుంది. బన్నీ హార్డ్ కోర్ అభిమానులకు ‘డీజే’ పరవాలేదనిపించగా, సామాన్య ప్రేక్షకులకు మాత్రం ధియేటర్లలో ఆ కాసేపు కూర్చోవడం, ముఖ్యంగా సెకండాఫ్ సమయంలో ఇబ్బందికరంగానే ఉందన్న టాక్ సొంతం చేసుకుంది.

అయితే టాక్ ఎలా ఉన్నా, ఓపెనింగ్స్ పరంగా అల్లు అర్జున్ కెరీర్ లోనే టాప్ చైర్ ను అందుకుంది అనేది ట్రేడ్ టాక్. నిజానికి ఇది ముందుగా అంచనా వేసిన విషయమే గానీ, ఫస్ట్ షో పడిన సమయం నుండి భిన్న స్పందనలు వ్యక్తం కావడంతో, ఎంతమేరకు ‘డీజే’ కొల్లగొడతాడో అన్న సందేహం నెలకొంది. అయితే వాటన్నింటిని పటాపంచలు చేస్తూ… బన్నీ కెరీర్ లోనే కాదు, హరీష్ శంకర్, దిల్ రాజు కెరీర్ లో కూడా “దువ్వాడ జగన్నాధమ్” ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి.

ADVERTISEMENT

ఓవర్సీస్ లో మాత్రం మరోసారి బన్నీకి నిరుత్సాహపరమైన ఫలితమే ఎదురుకానుందన్న సంకేతాలు కనపడుతున్నాయి. ఏపీ, తెలంగాణాలో అదిరిపోయే సక్సెస్ ను చవిచూసిన ‘సరైనోడు’ కనీసం 1 మిలియన్ డాలర్స్ కూడా అందిపుచ్చుకోలేదన్న విషయం తెలిసిందే. తాజా మూస కమర్షియల్ సినిమాగా తెరకెక్కిన “దువ్వాడ జగన్నాధమ్” కూడా అదే బాటలో పయనిస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ప్రీమియర్స్ కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉండడంతో పాటు రివ్యూలు నెగటివ్ గా రావడంతో, ఏదైనా అద్భుతం జరిగితే తప్పితే, ఈ సినిమాకు కూడా 1 మిలియన్ డాలర్స్ కష్టమే అని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories