బన్నీ హంగామా మూడు రోజులేనా?

Duvvada-Jagannadham-hungama-only-for-3-days!హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు తన 25వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన “దువ్వాడ జగన్నాధమ్” తొలి రోజు మంచి వసూళ్ళనే సాధించింది. చిత్ర హీరో అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ ను సాధించిన సినిమాగా రికార్డులైతే సృష్టించింది గానీ, అదే సమయంలో ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు తెచ్చుకుంది. ఈ ప్రభావం రెండవ రోజు కలెక్షన్స్ పై స్పష్టంగా పడగా, మూడవ రోజు ఆదివారం కావడంతో పర్వాలేదనిపించేగా ఉన్నాయి.

ADVERTISEMENT

ఇక అసలు పరీక్ష సోమవారం ప్రారంభం కానుంది. అయితే ఆ సోమవారంతోనే “దువ్వాడ జగన్నాధమ్” ప్రమోషన్స్ కు శుభంకార్డు వేసే విధంగా ‘థ్యాంక్యూ మీట్’ను ఏర్పాటు చేసారు. బహుశా మొదటి మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ గురించి ప్రస్తావించి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్తూ ముగించేస్తారేమో చూడాలి. సాధారణంగా నిజమైన సక్సెస్ సాధించిన సినిమాలకు ఒకటి, రెండు వారాల తర్వాత, ఆ రేంజ్ ను బట్టి సక్సెస్ మీట్ లు గానీ, థ్యాంక్యూ మీట్ లు గానీ ఏర్పాటు చేస్తుంటారు.

గతంలో పవన్ “అత్తారింటికి దారేది” సినిమాలో విషయంలో అయితే 50 రోజులకు ఏర్పాటు చేయగా, అల్లు అర్జున్ గత చిత్రం “సరైనోడు” సక్సెస్ వేదిక కూడా సినిమా విడుదలైన రెండు వారాల తర్వాత ఏర్పాటు చేసారు. నాడు ఈ వేడుక నుండే బన్నీ ‘చెప్పను బ్రదర్’ అంటూ ప్రారంభించాడు. అలా సినిమా రన్ అయ్యే విధానాలను బట్టి ఈ వేడుకలను ఏర్పాటు చేయడం ఆనవాయితీ. మరి చిత్ర యూనిట్ నిర్ణయించిన తేదీ ప్రకారం అయితే… బన్నీ ‘దువ్వాడ జగన్నాధమ్’ హంగామా కేవలం మూడు రోజులేనా?

మరి ఈ వేడుక పైన బన్నీ ఏం చెప్తానంటారో… ఏం చెప్పనంటారో… చూడాలి..!

ADVERTISEMENT
Latest Stories