తూర్పుగోదావరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి గట్టి షాక్ ఇచ్చాయి. కూటమి ప్రభంజనం ముందు వైసీపీ నిలవలేకపోయింది. జిల్లా వ్యాప్తంగా 96 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరగగా.. వైసీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది.
మండపేటలో కూటమి అభ్యర్థులు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. మొత్తం 36 వార్డులనూ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేశారు. కొవ్వూరులోనూ 28 వార్డులకు గాను 27 స్థానాలను గెలుచుకుని సత్తా చాటారు. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
నిడదవోలులో మాత్రం కూటమి పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా సాగింది. మొత్తం 32 వార్డుల్లో జనసేన 14, టీడీపీ 13, బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. వైసీపీ మూడు స్థానాలకే పరిమితం కాగా, మరో వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
మండపేటలో వందశాతం విజయం, కొవ్వూరులో దాదాపు క్లీన్ స్వీప్, నిడదవోలులోనూ కూటమి ఆధిపత్యం.. ఇలా తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వైసీపీకి గట్టి రాజకీయ సందేశం ఇచ్చాయి.




