ముద్దుల కోసం ‘లంచాలు’ ఇస్తున్న హీరో!

Emraan Hashmi gifts one bag to his wife Parveen for every film he kisses in,సినిమాలలో హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు… అందులో భాగంగా ముద్దులు, మురిపాలు సర్వసాధారణమే. అయితే ఈ ముద్దుల్లో కూడా ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. మరి ఇందులో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హాష్మి ప్రత్యేకత ఏమిటో అందరికీ తెలిసిందే. గాఢమైన ముద్దులకు, పెదాలతో పండగ చేసుకునే ముద్దులకు కేరాఫ్ అడ్రస్ అయిన ఇమ్రాన్ హాష్మి, తాజాగా ముద్దుల నిమిత్తం లంచాలు ఇవ్వడం ఇస్తున్నారట.

ADVERTISEMENT

పెళ్ళికి ముందు ఎన్ని కిస్సింగ్ సీన్లలో నటించినా ఎలాంటి ఇబ్బంది తలెత్తదని, అయితే పెళ్ళయిన తర్వాత మాత్రం భార్యతో తిప్పలు తప్పవని తన అనుభూతులను చెప్పుకొచ్చారు ఈ సీరియల్ కిస్సర్. ముద్దు సన్నివేశాలలో నటించానని తన భార్యకు తెలిస్తే… ఒకప్పుడైతే బ్యాగ్గులతో దాడి చేసేదని, ప్రస్తుతం మాత్రం చేత్తోనే కొడుతోందని సరదాగా తన ‘ముద్దు – ముచ్చట్లు’ చెప్పుకొచ్చారు.

అయితే ఇలాంటి సమయంలో తన భార్యను శాంత పరిచేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుండే వాడినని.., సినిమా సన్నివేశాలలో ఎన్ని ముద్దులు పెడితే అన్ని బ్యాగ్గులు లేదంటే అన్ని ఖరీదైన ఆభరణాలు తన భార్యకు లంచాలుగా ఇచ్చి కాస్త శాంతపరిచే ప్రయత్నం చేస్తుండే వాడినని నవ్వుతూ చెప్పారు. వెండితెరపై ప్రేక్షకులు రొమాంటిక్ సన్నివేశాలు చూడాలంటే… బ్యాక్ గ్రౌండ్ లో హీరోలకు ఇన్ని తిప్పలు ఉన్నాయన్నమాట..!

ADVERTISEMENT
Latest Stories