fake letters from AP NTR Fans Association letterheadస్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వారసుడు, అభిమానులు యంగ్ టైగర్ అని ముద్దుగా పిలుచుకునే హీరో ఎన్.టి.ఆర్. తాతగారి సినీ వారసత్వాన్ని తన భుజాలమీద మోస్తూ తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తున్న ఎన్టీఆర్ ని, నందమూరి అభిమానులు గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు. అభిమానులు ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడా? అని ఎదురుచూస్తున్నారు.

తాను రాజకీయాల్లోకి ఖచ్చితంగా వస్తానని, కానీ కొంత టైం పడుతుందని, ఎన్టీఆర్ ఎన్నోసార్లు అభిమానులకు చెప్పారు. తాతగారి పార్టీ మీద ప్రేమతో, చంద్రబాబు తరఫున గతంలో ప్రచారం కూడా చేసారు ఎన్టీఆర్.

ఇటీవల మీడియా లో కృష్ణా జిల్లా ఎన్టీఆర్ అభిమానులు, తమ అభిమాన నటుడు ఎన్టీఆర్ ని, చంద్రబాబు నాయుడు ఊరికే వాడుకుంటున్నాడని, అక్రమంగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నడుపుతున్నాడని, ఎన్టీఆర్ మీద ట్రోల్స్ చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి గోడ మీద చంద్రబాబు నీచ చరిత్ర లిఖిస్తామని… ఇందులో ఏ పార్టీ హస్తం లేదని, కేవలం ఎన్టీఆర్ మీద అభిమానంతో చేస్తున్నామని లేఖ రాసారు. ఇది ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. చూసినవాళ్లు ఎన్టీఆర్ అభిమానులు ఇంత మూర్ఖులా..? అనిపించేలా ఆ లేఖ ఉంది.

ఈ లేఖ చూసిన కృష్ణా జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘాలు, పై రాతలను ఖండిస్తూ మేము కేవలం ఎన్టీఆర్ అభిమానులం, మాకూ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. సోషల్ మీడియాలో ఎవరో సృష్టించిన ఈ లేఖ కు మాకు సంబంధం లేదన్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడూ ఇటువంటి తప్పుడు పనులు చెయ్యరని, అవసరమైతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మీడియాలో సమాధానమిచ్చారు.

అసలు ఇటువంటి లేఖలు రాసి, ఎన్టీఆర్ కి అభిమానులకి మధ్య చిచ్చు పెట్టి కారణం చంద్రబాబు మీద తోసేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? సర్లే అది చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారుగా!