నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడు కూడా అందరు హీరోల ఫ్యాన్స్‌కు తాము విభిన్నం అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. త్వరలో మరోసారి నందమూరి ఫ్యాన్స్ అదే పని చేయబోతున్నారు. బాలకృష్ణ హీరోగా నటించిన ‘డిక్టేటర్’ ఆడియో వేడుక ఈనెల 20న అంగరంగ వైభవంగా జరుగబోతున్న విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఈ వేడుకను నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు షురూ అయ్యాయి. ఈ వేడుకకు హైదరాబాద్ నుండి నందమూరి ఫ్యాన్స్ 99 క్లారతో ర్యాలీగా అమరావతికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
హైదరాబాద్ నుండి ఆడియో విడుదల రోజు ఉదయం అన్ని కార్లు కూడా ఒకేసారి ప్రారంభం అవ్వబోతున్నాయి. బాలకృష్ణ నటించిన 99వ సినిమా అవ్వడం వల్ల 99 కార్లతో ర్యాలీ నిర్వహిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో నందమూరి అభిమానులు ఇలా డిసైడ్ అయ్యారు. ఈ ఆడియో వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం హాజరు కాబోతున్నాడు. పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు, అభిమానులు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఇలా ఎంతో మంది ‘డిక్టేటర్’ ఆడియో వేడుకలో పాల్గొనబోతున్నారు. ఇదో భారీ పార్టీ సభను తలపించేలా జరుగబోతుందని నిర్వహకులు భావిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా అంజలి మరియు సొనాల్ చౌహాన్‌లు హీరోయిన్‌లుగా నటించారు. శ్రీవాస్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను ఈరోస్ సహకారంతో నిర్మించాడు. జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.





