“నాన్నకు ప్రేమతో” రన్ టైం! ఫ్యాన్స్ కు అసలు టెన్షన్!

fans tension for ntr nannaku prematho run time“నాన్నకు ప్రేమతో” సినిమా షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న సమయంలో ఈ సినిమా రన్ టైం దాదాపు మూడు గంటలన్నర్ర పైగా వచ్చిందని, దాన్ని కత్తిరించడం ఎడిటర్ కు తలకు మించిన భారంగా మారిందనే టాక్ సినీ వర్గీయుల్లో వ్యక్తమయ్యింది.

కట్ చేస్తే, ఈ సినిమా సెన్సార్ అయ్యింది… ‘యు/ఎ’ సర్టిఫికేట్ వచ్చింది… దాంతో పాటు తాజాగా ఈ సినిమా రన్ టైం కూడా బయటకు వచ్చింది. 168 నిముషాల పాటు “నాన్నకు ప్రేమతో” సినిమా వుండడం, ఫ్యాన్స్ కు కూడా కాస్త కలత చెందే అంశమే.

ADVERTISEMENT

ముఖ్యంగా సుకుమార్ గత చిత్రం “1 నేనొక్కడినే” సినిమా రన్ టైం కూడా 170 నిముషాలు ఉండడం… ఆ తర్వాత 10 నిముషాలు కట్ చేయడం… తదితర సంఘటనలన్నీ తెలిసిందే. దీంతో తండ్రీ కొడుకుల ఎమోషనల్ సన్నివేశాలతో కూడిన “నాన్నకు ప్రేమతో” సినిమాకు ఈ రన్ టైం ఎంతవరకు దోహదం చేస్తుందో అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories