కాపీ చేస్తే ఎవరికైనా ఇంతే!

First Look At Jr NTR Err Big Boss Teaser‘బిగ్ బాస్’ షో ద్వారా బుల్లితెర పైకి ప్రవేశించబోతున్న జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఎస్.ఎస్.థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఫస్ట్ టీజర్ ను షోను ప్రసారం చేసే ఛానల్ విడుదల చేసింది. అయితే ఈ టీజర్ పై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ ను సూటు, బూటు గెటప్ లో చూడడం అరుదు కావడంతో అభిమానుల దృష్ట్యా తారక్ లుక్ ఆకట్టుకుంది. అలాగే థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఆకట్టుకునే విధంగా ఉంది.

కానీ ఈ టీజర్ ‘జేమ్స్ బాండ్’ సినిమాలోని టైటిల్స్ కార్డ్స్ పడేటప్పుడు వచ్చేదిగా ఉండడంతో… కొత్తదనం ఆశించే ప్రేక్షకులు మాత్రం పూర్తిగా నిరాశ చెందారు. అందులోనూ ‘బిగ్ బాస్’ షో కాన్సెప్ట్ కు దూరంగా టీజర్ ఉండడం విశేషం. ఇక థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా జేమ్స్ బాండ్ సినిమాలోనిదే కావడం మరో మైనస్ పాయింట్. మరి థమన్ ఎలా ఇచ్చారో, టెక్నికల్ టీం ఎలా అంగీకరించిందో గానీ, వినడానికి బాగానే ఉన్నా, అది కాపీ కావడం విమర్శలకు తావిచ్చింది.

ADVERTISEMENT

దీంతో జూనియర్ ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ ఫస్ట్ టీజర్ ఆశించిన ఫలితాలను అయితే అందుకోలేదని చెప్పవచ్చు. ‘కాపీ’ కొడితే… ఎంతటి స్టార్ హీరో అయినా విమర్శలకు గురికాక తప్పదని ఈ టీజర్ మరోసారి నిరూపించింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ను నిందించడానికి ఏమీ ఉండదు. టీజర్ రూపకల్పన అనేది టెక్నికల్ డిపార్టుమెంటుకు సంబంధించిన అంశం కావడంతో… వచ్చే విమర్శలు కూడా వారిని టార్గెట్ చేసుకునే ఉంటాయి. అయితే లుక్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories