వరుసగా 15, 20 రోజుల పాటు వర్షం కురవడంతో నీటిలో తేలియాడిన చెన్నై నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే చెన్నైకు మరో పెను ముప్పు ఉందంటూ నేషనల్ మేరీటైం ఇన్ఫర్మేషన్ సెంటర్ పలు హెచ్చరికలు జారీ చేసింది.
“తమిళనాట సముద్ర నీటిమట్టం పెరగనుందని, 8 నుండి 10 అడుగుల మేర రాకాసి అలలు ఎగసిపడవచ్చని, ఈ ప్రభావం కారణంగా కన్యాకుమారి జిల్లాలోని కులాచ్చాల్ నుండి రామనాధపురం జిల్లాలోని కీలక్కరాయ్ వరకు తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.
55 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయనే అంచనాలతో మత్య్సకారులను సముద్రంలోకి వెళ్ళవద్దని, సోమవారం అర్ధరాత్రి వరకు ఈ ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. తమిళనాట ఉన్న బీచ్ లలోకి ప్రజలను, పర్యాటకులను కూడా అనుమతించడం లేదు. ఈ హెచ్చరికలతో తమిళ సర్కార్ అలెర్ట్ అయ్యింది. ఈ ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవడానికి సునామీ టీంలను సిద్ధం చేసింది.





