మురుగదాస్ సినిమాలో మరో హైలైట్ – మహేష్ ఫారెస్ట్ ఫైట్!

Forest fight scene in mahesh babu Sambhavamiమురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం జరుపుకుంటోన్న సినిమా ‘పక్కా యాక్షన్ ఎంటర్టైనర్’ అన్న విషయం తెలిసిందే. ప్రిన్స్ ఇంటిలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా కనపడుతున్న ఈ సినిమాలో యాక్షన్ దృశ్యాలు హైలైట్ గా నిలవనున్నాయని గత కొన్నాళ్ళుగా ట్రేడ్ వర్గాల్లో మంచి టాక్ ఉంది. ముఖ్యంగా ఇంటర్వెల్ కు ముందు వచ్చే యాక్షన్ దృశ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు.

ADVERTISEMENT

అలాగే సినిమాలో మరో ఆకర్షణగా అడవిలో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాల గురించి చెప్తున్నారు. ‘పోకిరి’ సినిమాలోని ట్రైన్ ఫైట్ ఎంతగా హైలైట్ అయ్యిందో, దానిని మించిపోయే స్థాయిలో ఈ ఫారెస్ట్ ఫైట్ చిత్రీకరణ జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మహేష్ చేత పీటర్ హైన్స్ నేతృత్వంలో మురుగదాస్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ దృశ్యాలను చేపించినట్లుగా స్పష్టమవుతోంది. దీనికి సంబంధించిన శాంపిల్ ను టీజర్ రూపంలో మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ADVERTISEMENT
Latest Stories