ఏమిరా… ఈ ‘కబాలి’ క్రేజు..!

Kabali, Fox Star Kabali, Fox Star Kabali Movie, Fox Star Kabali Hindi Movie, Fox Star Kabali Bollywood, Fox Star Rajinikanth Kabaliఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ చేయడమే ఆలస్యం… నిముషాల సమయంలో టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. రోడ్డు మీద నడిచే బస్సు నుండి ఆకాశంలో ఎగిరే విమానం వరకు అంతా ‘కబాలి’ మయమే! తమిళనాట సినీ స్టూడియోల నుండి యుఎస్ డిస్ట్రిబ్యూషన్ చేసే సినీ గాలక్సీ వరకు అంతా ‘తలైవా’ నామస్మరణే! ఇలా సర్వం ‘కబాలి’ మయం అయిపోతున్న నేపధ్యంలో… బాలీవుడ్ లో ‘కబాలి’ని పంపిణీ చేస్తున్న ఫాక్స్ స్టార్ సంస్థ బృందం మొత్తం కూడా రజనీకాంత్ లుగా మారిపోయారు.

ముంబైలోని ‘ఫాక్స్ స్టార్’ ప్రాంగణం మొత్తం ‘కబాలి’లోని రజనీకాంత్ మాస్క్ లతో ఫోటోకు ఫోజిచ్చారు. ఒకప్పుడు రజనీ అంటే దక్షిణాది వరకే పరిమితం. తమిళనాట రజనీ ఒక దైవం కాగా, తెలుగు, మలయాళ భాషల్లో కూడా రజనీకి విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ, ‘రోబో’ తర్వాత రజనీ మేనియా ఆకాశాన్ని తాకింది. దీంతో బాలీవుడ్ వర్గాలు కూడా దక్షిణాది హీరోకు ‘సలాం’ కొడుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న భారీ అంచనాలను ఈ ‘కబాలి’ అందుకుంటే… ఇండియన్ సిల్వర్ స్క్రీన్ రారాజుగా ‘తలైవా’ వెలుగొందుతాడని చెప్పడంలో సందేహం లేదు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories