అనంతపురం జిల్లా లేపాక్షి నాలెడ్జ్ హబ్ విషయంలో భూమి కేటాయింపులకు సంబంధించి సీనియర్ ఐఎఎస్ అధికారి శ్యాంబాబుపై సీబీఐ అభియోగాలు మోపింది. జగన్ అక్రమాస్తుల కేసులో భాగమైన ఈ అంశంలో శ్యాంబాబుపై సరైన ఆధారాలు చూపించడంలో విఫలమైన సీబీఐకు అనుమతి ఇవ్వడం లేదని కేంద్రం ప్రకటించింది.
నిబంధనలకు విరుద్ధంగా శ్యాంబాబు ఎలాంటి పని చేయలేదని భావించడంతో సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించలేదని తెలుస్తోంది. అయితే జగన్ అక్రమాస్తుల కేసు నుండి సదరు అధికారికి ఉపశమనం లభించినట్లయ్యింది. మరి జగన్ కు ఎప్పుడు “క్లీన్ చీట్” వస్తుందో అని వైసీపీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అసలు వస్తుందంటారా..?
ADVERTISEMENT
ADVERTISEMENT





