-game-changer--ram-charan

RRR తో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందాక మెగా వారసుడు ‘రామ్ చరణ్’ సోలో లీడ్ గా వస్తున్న సినిమా, భారతీయుడు -2 డిసాస్టర్ తరువాత దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న మూవీ “గేమ్ ఛేంజర్”. కొన్ని కోట్ల మంది అభిమానుల ఆశలకు, భయాలకు మధ్య రాబోతున్న ఈ మూవీ నుంచి వస్తున్న అప్ డేట్స్ ఎప్పటికప్పుడు తేదీలను మార్చుకుంటూ మెగా ఫాన్స్ కు నిరాశను మిగులుస్తున్నాయి.

చరణ్, కియారా జంటగా వస్తున్న ఈ మూవీలో నటి అంజలి తో పాటు ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో విలన్ గా బాగా ఫేమస్ అయిన ఎస్ జె సూర్య కూడా నటిస్తున్నారు. వారికీ తోడుగా దేవర మూవీలో జూ. ఎన్టీఆర్ సరసన స్క్రీన్ షేర్ చేసుకున్న సీనియర్ నటుడు శ్రీకాంత్ కూడా భాగమయ్యారు.

Also Read – ఇంకా ఆంధ్రాపై ఏడుపులేనా?

అయితే ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 20 లేదా క్రిస్మస్ స్పెషల్ గా థియటర్లలోకి రానుందంటూ నిర్మాత దిల్ రాజు ఖరారు చేసారు, అయితే ఇప్పుడే అది కూడా ఫైనల్ కాదు వచ్చే సంక్రాంతికే అనే రూమర్ బయటకు వచ్చింది. ఫిబ్రవరి 2021 లో అధికారికంగా ఆర్.సి-15 అంటూ లాంచ్ చేసిన ఈ చిత్రం ఆ ఏడాది అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభించుకుని ఇలా ఒక డైరెక్షన్ లేకుండా సాగుతూ పోతుంది.

అప్పటి నుండి చిత్ర యూనిట్ నుండి వచ్చిన అప్డేట్స్ వేళ్ళ మీద లెక్కించవచ్చు. విడుదల చేసిన ‘జరగండి జరగండి’ సైతం ఆశించిన మెప్పును పొందలేదు. తాజాగా చిత్ర యూనిట్ ‘రా మచ్చ మచ్చ’ అంటూ మరొక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు. అయితే ఈ పాట మాత్రం యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది.

Also Read – జగన్‌ హెచ్చరికలను లైట్ తీసుకుంటే…. ఫినిష్!

24 గంటల్లో అత్యధిక వ్యూస్ వచ్చిన పాట గా తన ఖాతాలో ఒక రికార్డును చేర్చుకుంది. అయితే, చిత్ర బృందం నుంచి వచ్చే అప్ డేట్స్ జాప్యంతో చరణ్ అభిమానులంతా అసలు ఈ డిసెంబర్ 20 న సినిమా బాక్స్ ఆఫీస్ ముందుకి వస్తుందా లేదా అనే సందేహంలో ఉన్నారు.

దీనికి తోడు ఈ దసరాకు మూవీ నుండి విడుదల చేస్తామని హామీ ఇచ్చిన టీజర్ అయిన విడుదలకు నోచుకుంటుందా అనే ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు. అయితే ఇప్పుడు వారి భయాలకు తగ్గట్టే మూవీ సంగీత దర్శకుడు థమన్ చరణ్ ఫాన్స్ కి ఒక షాకింగ్ న్యూస్ అందించారు.

Also Read – పోలీస్ వ్యవస్థకు మద్దెల దరువేగా.?

“ఒకవేళ దసరా కు టీజర్ రాకపోతే, ఎవరు నిరుత్సాహ పడవద్దు! సి.జి-వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ ఫైనల్ ఎడిటింగ్, డబ్బింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొదలయ్యాయి. చిత్ర యూనిట్ అంతా లిరికల్ సాంగ్స్ వీడియో పని లో బిజీ గా ఉన్నారు. ఇక నుండి అప్డేట్స్ ప్రతీ నెల వస్తుంటాయి” అంటూ ఫాన్స్ కు సమాచారం అందించారు.

అలాగే ఈ నెల 30 కు సిద్ధమయిన పాట మాత్రం కచ్చితంగా అనుకున్న తేదికి మీ ముందుకు వస్తుందని తేల్చేశారు. దీనితో ఈ దసరాకు గేమ్ చేంజెర్ నుంచి ఎటువంటి అప్ డేట్ ఉండకపోవచ్చు అని థమన్ ద్వారా చరణ్ ఫాన్స్ కు దర్శకుడు శంకర్ ఒక అప్ డేట్ పంపించాయారన్నమాట.

అలాగే దర్శకుడు శంకర్ సైతం భారతీయుడు-2 వంటి డిసాస్టర్ తరువాత ఈ సినిమా ను చాల ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. ఆయన సినిమా కెరీర్ సాఫీగా ముందుకెళ్లేందుకు ఈ సినిమా విజయం ఆయనకు ఎంతో ముఖ్యం. అందునా RRR తరువాత వచ్చిన దేవర మంచి వసూళ్లు సాధిస్తూ ఎన్టీఆర్ ఫాన్స్ కు మంచి కిక్కివ్వడం తో ఇక ఆ ప్రజర్ ఇప్పుడు రామ్ చరణ్ ను తాకింది.

చరణ్ కు కూడా 2019 తరువాత సోలో రిలీజ్ లేదు, దేవరతో జూ.ఎన్టీఆర్ జక్కన్న సెంటిమెంట్ ను బ్రేక్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ జక్కన్న సెంటిమెంట్ ను బ్రేక్ చేయడం చెర్రీ వంతయ్యింది. దీనితో మూవీ నుంచి వచ్చే ప్రతి అంశంలోనూ అటు చిత్ర యూనిట్ చాల జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది.




పిల్లి బాధ పిల్లిది ఎలుక బాధ ఎలుకది అన్నట్టుగా మూవీ టీం కష్టాలు మూవీ టీం కు, ఫాన్స్ ఆవేదన ఫాన్స్ కు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. కనీసం సినిమా విడుదల తేదీలో అయినా ఎటువంటి ఛేంజెస్ లేకుండా చూసుకోవాలి అంటూ గేమ్ ఛేంజర్ యూనిట్ కు చరణ్ అభిమానులు విజ్ఞప్తులు చేసుకుంటున్నారు.