వావ్… చంద్రబాబు ఎఫెక్ట్… ఎయిర్ పోర్ట్ లుక్ అదుర్స్..!

Gannavaram Airport First Lookఇంతకుముందు విజయవాడకు దగ్గరగా గల గన్నవరం విమానాశ్రయాన్ని చూసి… ప్రస్తుతం అదే ఎయిర్ పోర్టును చూస్తున్న వారి ఫస్ట్ ఫీలింగ్ ఏమిటో తెలుసా..? ‘వావ్… అని!’ అవును… చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడ విమానాశ్రయం రూపురేఖలు మారిపోయాయన్నది అందరూ అంగీకరించే విషయమే. అయితే అది ఎంతమేరకు అంటే… ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏ మాత్రం తగ్గకుండా, ఇంటర్నేషనల్ వసతులతో అందంగా తయారుచేయడంలో ప్రభుత్వం సక్సెస్ సాధించింది.

దీనికి ప్రధాన కారణం… కేంద్రంలో విమానాశ్రయ మంత్రిగా అశోక గజపతిరాజు తన సహాయ సహకారాలు అందించడం ఒకటి అయితే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చూపరులను ఆకర్షించే విధంగా ఎయిర్ పోర్టును ముస్తాబు చేయడం అసలు కారణం. ఈ విమానాశ్రయానికి సంబంధించిన పలు వీడియోలు, ఫోటోలు ఇప్పటికే బయటకు రివీల్ కాగా, తాజాగా మరో ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అద్దంలా కనపడుతున్న ఈ ఫోటోను చూసి వీక్షకులు కూడా ‘వావ్…’ అనక తప్పడం లేదు మరి!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories