‘శాతకర్ణి’ విజయం కావాలని కోరుకుంటున్న ‘మెగా ఫ్యాన్స్’

gautamiputra-satakarni-director-krish‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ ఈక్వేషన్స్ ను మార్చివేసినట్లుగా కనపడుతోంది. ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత చిరంజీవి గారు వరుసపెట్టి సినిమాలు చేస్తారన్న విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ వెల్లడించడంతో అభిమానులు మిక్కిలి సంతోషానికి గురయ్యారు. అంతేకాదు, 151వ సినిమాను కూడా తామే నిర్మిస్తున్నామని చెర్రీ చెప్పడంతో, ఆ అవకాశాన్ని దక్కించుకున్న అదృష్టవంతుడు ఎవరా? అన్న ప్రశ్న ట్రేడ్ వర్గాల్లో చర్చలకు దారి తీసింది.

ముందుగా అనుకున్న ప్రకారం అయితే బోయపాటి శ్రీనుకు ఆ అవకాశం దక్కాలి. కానీ, బోయపాటి ఈ రేసు నుండి తప్పుకున్నట్లుగా లేటెస్ట్ న్యూస్. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో ఒక్కసారిగా ట్రేడ్ వర్గాలను ఒక ఊపు ఊపుతున్న దర్శకుడు క్రిష్ ను మెగాస్టార్ 151వ సినిమా అవకాశం వరించిందని తెలుస్తోంది. అయితే ఇదంతా క్రిష్ దర్శకత్వం వహించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా విజయంపై ఆధారపడి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాతో క్రిష్ సక్సెస్ అందుకుంటే… మెగాస్టార్ మరో మూవీకి దాదాపుగా శ్రీకారం చుట్టినట్లేనని ఫిల్మ్ నగర్ టాక్.

ADVERTISEMENT

దీంతో బాలకృష్ణ నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విజయం సాధించాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే గనుక చిరు తన తదుపరి చిత్రాన్ని వెనువెంటనే ప్రారంభిస్తారని, లేదంటే మరికొంతకాలం ఆలస్యమవుతుందని, అందుకని తమ ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో పాటు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఈ వార్తే నిజమైతే, బాలయ్యతో చారిత్రాత్మక సినిమాను తీసిన క్రిష్, మెగాస్టార్ తో ఎలాంటి సినిమాను తీస్తారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories