‘గౌతమీపుత్ర శాతకర్ణి’ టాక్ వచ్చేసిందిగా!

gautamiputra-satakarni-premier-show-talkఈ గురువారం నాడు విడుదలకు సిద్ధమైన నందమూరి నటసింహం 100వ సినిమా “గౌతమీపుత్ర శాతకర్ణి” విజయంపై చిత్ర బృందం ఎనలేని నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు క్రిష్, హీరో బాలకృష్ణ పూర్తి విశ్వాసం వ్యక్తపరిచిన ఈ సినిమాను చంద్రబాబు తనయుడు, బాలకృష్ణ అల్లుడు, కూతురు కలిసి ఇప్పటికే వీక్షించేసారు. అంతేకాదు, ఈ సినిమా చూసిన ఆనందంలో లోకేష్ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి క్లుప్తంగా చెప్పుకోచ్చేసారు.

‘గౌతమీపుత్ర శాతకర్ణి ప్రీమియర్ షోను చూశానని, అమరావతి చరిత్రను మళ్ళీ చూసినట్లుగా ఉందని, మామయ్య బాలయ్య అద్భుతమైన అభినయానికి ముగ్దులమయ్యామని, అలాగే చిత్రంలో అనేక స్ఫూర్తిదాయకమైన పాత్రలు ఉన్నాయని, దర్శకుడు క్రిష్ కు ప్రత్యేక అభినందనలు’ అంటూ లోకేష్ తొలి టాక్ ను బయటపెట్టారు. అయితే ఇదంతా మామపై కురిపించిన ప్రేమ లేక సినిమా నిజంగానే అలా ఉందా అని తెలియాలంటే గురువారం వరకు వేచిచూడాల్సిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories