మహేష్ రికార్డును కొట్టేసిన విజయ్!

Geetha Govindam -breaks Bharat Ane Nenu Recordsవంద కోట్లు పైగా గ్రాస్ వసూళ్లతో టాలీవుడ్ ను షేక్ చేసిన “గీత గోవిందం,” పలు రికార్డులను తన సొంతం చేసుకుంది. ముఖ్యంగా యుఎస్ లో అగ్ర హీరోల సినిమాలను కూడా అధిగమించి 2.2 మిలియన్స్ ను తాకగా, తమిళనాడులో అయితే ఏకంగా ‘నాన్ బాహుబలి’ రికార్డును కైవసం చేసుకుంది. అవును… ఈ ఏడాది ‘భరత్ అనే నేను’ సినిమాతో ప్రిన్స్ మహేష్ బాబు నెలకొల్పిన రికార్డును విజయ్ దేవరకొండ గీత గోవిందం’ చెరిపివేసింది.

[m9ad]

ADVERTISEMENT

ఇప్పటివరకు ఈ సినిమా గ్రాస్ వసూళ్లు 5 కోట్లు దాటడంతో, ఈ రికార్డు అధికారికం అయ్యింది. తొలివారం నమోదైన కలెక్షన్స్ ను బట్టి ఈ రికార్డు ‘గీత గోవిందం ‘సొంతం అవుతుందని ట్రేడ్ పండితులు ముందుగానే అంచనాలు వేసారు, ఇప్పుడు అది కార్యరూపం సిద్ధించుకుంది. దీంతో ఇక నుండి తమిళనాడులో ‘నాన్ బాహుబలి’ రికార్డు విజయ్ దేవరకొండ పేరు మీద ఉండనుంది. విజయ్ ట్రెండ్ చూస్తుంటే త్వరలోనే స్టార్లకు చుక్కలు చూపించే విధంగా కనపడుతున్నాడు.

ADVERTISEMENT
Latest Stories