‘అర్జున్ రెడ్డి’ సినిమాలో యాటిట్యూడ్ ప్రదర్శించే క్యారెక్టర్ లో జీవించిన విజయ్ దేవరకొండ, ఇటీవల ఫిలిం ఫేర్ కూడా అందుకున్నారు. అతి త్వరలోనే “టాక్సీవాలా” సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించనున్న విజయ్, తన తదుపరి సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తోన్న ఈ సినిమాకు “గీతగోవిందం” అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా ఇటీవల ప్రకటించగా, తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.
ఓ గోడకు ఆనుకుని ఉన్న విజయ్ దేవరకొండ కాళ్ళపై హీరోయిన్ రష్మిక మందన కూర్చుని ఉన్న ఈ స్టిల్ ఈ సమ్మర్ లో కూల్ గా కనపడుతోంది. ఈ పోస్టర్ కు ఓ కాప్షన్ కూడా రాసుకొచ్చాడు విజయ్. “నా కాళ్లు తిమ్మిరెక్కినా… నడుము నెప్పిలేచినా… మీ బరువు… బాధ్యత ఎప్పుడూ నాదే మేడమ్…” అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేసాడు. విజయ్ కున్న క్రేజ్ తో ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.



