నాగార్జున ఇంటిముందు అర్దరాత్రి హడావుడి!

girl  hulchu infron of Nagarjuna Akkineni houseటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇంటి వద్ద మంగళవారం రాత్రి ఓ యువతి నానా యాగీ చేసింది. నాగ్ తనకు నాలుగు కోట్ల రూ‌పాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నానా రభస చేసింది. దీంతో అక్కడి భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం… ఆదిలాబాద్‌కు చెందిన విజయ అనే మహిళ మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్‌కు చేరుకుంది.

రోడ్డు నంబరు 51లో ఉన్న నాగార్జున ఇంటికి వెళ్లి, తాను నాగ్ కలవాలని అనుకుంటున్నట్టు పీఏకు చెప్పి లోపలికి పంపించాల్సిందిగా కోరింది. అయితే ఎందుకు కలవాలనుకుంటున్నదీ ప్రశ్నించగా, నాగార్జున తనకు 4 కోట్లు ఇవ్వాలని చెప్పడంతో ఆశ్చర్యపోయాడు. నాగార్జున లేరని తర్వాత రావాలని చెప్పినా వినిపించుకోకుండా రోడ్డుపై హడావిడి చేసింది. దీంతో పోలీసులకు సమాచారం అందించగా, ఆమె మానసిక స్థితి సరిగా తేల్చిన పోలీసులు, బంధువులకు సమాచారం అందించి అప్పగించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories