సూర్య హీరోగా, స్టూడియో గ్రీన్ పతాకం పై, చాలా సినిమాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా.. ఇటీవల నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తమిళ ఫంక్షన్ లో, తమిళ హీరోలను కించపరుస్తూ అనుచిత వాఖ్యలు చేసారు.
తమిళ హీరోలు ఒక్కో సినిమాకు 50 కోట్లు పైగా తీసుకుంటారని, తెలుగు హీరోలు 15 కోట్లు మాత్రమే తీసుకుని.. నిజాయితీతో పనిచేస్తారని, తమిళ హీరోలందరూ.. తెలుగు హీరోలను చూసి నేర్చుకోవాలన్నారు. 50 కోట్లు పైన తీసుకుంటున్న తమిళ హీరోల్లో రజినీకాంత్ ఒక్కరేగా ఉన్నది! జ్ఞానవేల్ రాజా చెప్పినట్లు మిగిలిన హీరోలు కూడా, 50 కోట్లు పైనే ఒక్కో సినిమాకు పారితోషికం తీసుకుంటున్నారా? తన బంధువులు ఐన తమిళ స్టార్ హీరోలు సూర్య, కార్తీ, ఎంత తీసుకుంటున్నట్లు? క్లారిటీ మిస్ అయ్యింది రాజా.
కొన్ని రోజుల క్రితం జ్ఞానవేల్ రాజా భార్య నేహా తన ట్విట్టర్ అకౌంట్ లో.. తమిళ హీరోయిన్లు కొంపలు కూల్చేస్తున్నారని, వారి జాతకాలు బయట పెడతానని, గమ్మున ఉండిపోయింది.
తన బ్యానర్ అయిన స్టూడియో గ్రీన్ పతాకం పై జ్ఞానవేల్ రాజా సగర్వంతో సమర్పించిన సినిమాల్లో నటించిన తమిళ హీరోలు కార్తీ, సూర్య, విజయసేతుపతి, శివకార్తికేయన్ ఈ మాటలకు
ఎలా స్పందిస్తారో?.



