“గో బ్యాక్ మార్వాడి” స్పందించే ధైర్యం ఉందా.?

Go Back Marwadi Movement Challenges BRS

ఇన్నేళ్ళుగా బిఆర్ఎస్ చేతిలో వజ్రాయుధంగా, ఇతర పార్టీల బలహీనతగా మారిన సెంటిమెంట్ ఉద్యమాలు..ఉదాహరణకు ‘తెలంగాణ’ ఉద్యమం బిఆర్ఎస్ కు ఎంత గా రాజకీయ లబ్ది తెచ్చిపెట్టింది తద్వారా బిఆర్ఎస్ అన్ని రాజకీయ పార్టీలను రాజకీయంగా ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందో అందరం చూసాం.

తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆంధ్రాకు సానుకూలంగా స్పందిస్తే చాలు వారందరిని తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరిస్తూ వారి పై తెలంగాణ వ్యతిరేకులు అంటూ ముద్ర వేసేసి తెలంగాణ రాజకీయాలను నుండి ఆ పార్టీలను వెలిసేస్తారు.

ADVERTISEMENT

బిఆర్ఎస్ చేసిన ఈ తరహా రాజకీయం తోనే టీడీపీ తెలంగాణలో రాజకీయంగా పట్టు కోల్పోయింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పదేళ్ల సమయం పట్టింది. అయితే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ని కూడా ఇదే మాదిరి ఉద్యమం ఒకటి వెంటాడుతుంది. అదే ‘గో బ్యాక్ మార్వాడి’ ఉద్యమం.

సున్నితమైన ఈ అంశం మీద స్పందించేందుకు ఇంతవరకు ఒక్క బీజేపీ తప్ప మరొకరు సాహసించలేకపోతున్నారు. దేశంలో ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అంటూ బీజేపీ మార్వాడీలకు మద్దతుగా నిలిచింది. కానీ అధికార కాంగ్రెస్ కానీ ప్రతిపక్ష బిఆర్ఎస్ కానీ ఈ నినాదం పై ఇప్పటి వరకు ఎవరికి అనుకూలంగా కానీ ఎవరికీ వ్యతిరేకంగా కానీ గళం విప్పలేదు.

ఓటు బ్యాంకు రాజకీయాలు పార్టీలను, పార్టీల అధినేతలను అవసరానికి తగ్గట్టుగా ఒకసారి ఉద్యమ స్వరం తో గర్జించేలా చేస్తే మరోసారి లైబ్రరీ లో ఉన్న విద్యార్థి మాదిరి సైలెన్స్ లో ఉంచుతుంది. ఒకరికి అనుకూలంగా ప్రకటన చేస్తే అది ఖచ్చితంగా మరొకరికి వ్యతిరేకమే అవుతుంది.

ఈ నేపథ్యంలో ఎవరి వ్యతిరేకత తమ పార్టీకి ఓటు బ్యాంకును దూరం చేస్తుందో అన్న భయం పార్టీల అధినేతలతో కనిపిస్తుంది. ముందు నుయ్యి వెనుక గొయ్యి లాంటి ఇటువంటి సున్నితమైన అంశాలతో రాజకీయం పార్టీలకు ఏ మేరకు హానికరమే బిఆర్ఎస్ కు చాల బాగా తెలుసు.

అటువంటి సందర్భాలనే ఇన్నాళ్లు తనకు అట్నా పార్టీకి అనుకూలంగా మార్చుకుంటూ గులాబీ జెండా చుట్టూ సెంటిమెంట్ అనే గోడ కట్టారు. ఇప్పుడే అదే ఆందోళన గో బ్యాక్ మార్వాడి ఉదయమంతో బిఆర్ఎస్ ఎదుర్కొంటుంది. అందుకే గులాబీ కోట నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన రాలేదు.

అయితే నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రాని ఈ గో బ్యాక్ నినాదాలు ఇప్పుడు ఉద్యమం రూపంలో ఒక్కసారిగా ఉవ్వెత్తున రావడం వెనుక ఏ రాజకీయ పార్టీల హస్తం అయినా ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories