రెండు పార్టీల లక్ష్యం..వైసీపీ అంతమేనా?

TDP Janasena Allianceచంద్రబాబు అరెస్ట్ తో సైలెంట్ అయిన టీడీపీ కి జనసేన అధినేత పవన్ మద్దతు ఒక బూస్టుప్ లా పని చేస్తుందనే చెప్పాలి. కొన్ని రోజులనుంచి నడుస్తున్న ఈ పొత్తుల అంశానికి ఎట్టకేలకు తెర దించిన రెండు పార్టీలు ఇక అధికార పక్షం పై యుద్దానికి సిద్దమైనట్లే భావించాలి.

చంద్రబాబు అరెస్ట్ తో నారా లోకేష్ పార్టీ నేతలకు అందుబాటులో ఉంటూ అటు చంద్రబాబు కేసుకు సంబందించిన లీగల్ పనులలో నిమగ్నమైయ్యారు. ఈ సమయంలో టీడీపీ గొంతు ప్రజలలోకి తీసుకువెళ్లే బలమైన నాయకుడు కావాలి. అయితే ఇప్పుడు జనసేన – టీడీపీ పొత్తు రెండు పార్టీలకు ఒక దివ్య ఔషధం లా పనిచేస్తుంది.

ADVERTISEMENT

ఒక్కసారి రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తే అది ప్రతిపక్షాల గొంతుగా మారుతుంది. అప్పుడు జనసేన నేతల వాయిస్ కూడా టీడీపీ కి తోడవుతది. రెండు పార్టీల కార్యకర్తలు తమ తమ నాయకుల నిర్ణయాలకు కట్టుబడి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తే ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమి కాదు.

అధికార పార్టీ చేసే ప్రతి విమర్శని గట్టిగా తిప్పికొట్టగలిగిన సామర్థ్యం పవన్ సొంతం. పవన్ వాయిస్ కి టీడీపీ నేతలు తోడైతే ప్రభుత్వం కచ్చితంగా ఆలోచనలో పడుతుంది. రానున్న రోజులలో ఇంకా టీడీపీ నేతల పై కేసుల పరంపర కొనసాగుతుందని వైసీపీ నేతలు సెలవిస్తున్నారు.

టీడీపీ నేతలు ఎప్పుడు జైలుకు వెళతారు, వారికి ఎప్పుడు విడుదల దొరుకుతుంది అనే భవిష్యత్ ని చెప్పగలిగే వైసీపీ నాయకులు తమ భవిష్యత్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. జరిగేది ముందుగానే చెప్తుంది అంటేనే అర్ధమవుతుంది అధికార పక్షం పక్క ప్రణాళికగా ఈ అరెస్టుల కార్యక్రమం చేపట్టిందని.

ప్రతిపక్షాల పోరాటాలు ఎంత బలంగా ఉంటే అధికార పక్షం అంత బలహీన పడుతుంది.పార్టీకి అధినేత ఉన్నప్పుడు అండగా ఉండడం కాదు అధినేత సమస్యలలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలిచిన వాడే పార్టీకి నిజమైన విధేయుడవుతాడు. బాబు కి విపక్షాల మద్దతు ఎంత బలమో స్వపక్షాల అవకాశ వాదం అంత బలిహీనం.

బాబు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పనులను ఎండగడుతూ ఎప్పుడు ప్రజల మధ్య ఉంటూ పార్టీని, నేతలను ప్రజలకు అందుబాటులో ఉంచేవారు. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేయడంలో రెండు పార్టీలు క్షేత్ర స్థాయిలో బలంగా పని చేయాలి. అప్పుడే రెండు పార్టీల అధినేతల లక్ష్యం నెరవేరుతుంది.

ADVERTISEMENT
Latest Stories