మొత్తానికి వెబ్ సైట్ ను క్రాష్ చేసారు!

God Sex and Truthపోర్న్ స్టార్ మియా మల్కోవాతో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన “గాడ్, సెక్స్, ట్రూత్” సినిమాపై ఎంతటి క్రేజ్ ఉందో చెప్పడానికి నిదర్శనం ఇదని చెప్పవచ్చు. ఉదయం 9 గంటలకు http://godsextruth.online/ వెబ్ సైట్ లో ఈ సినిమాను విడుదల చేస్తామని చెప్పడంతో, వీక్షకులు దీని కోసం నిరీక్షించారు. అయితే తొమ్మిది అయ్యే సమయానికి నెటిజన్లు అంతా ఒక్కసారిగా ఈ వెబ్ సైట్ ఓపెన్ చేయడానికి ఉత్సాహం ప్రదర్శించడంతో, సాంకేతిక లోపంతో అది కాస్త క్రాష్ అయ్యి, ఓపెన్ అవ్వడానికే మొరాయించింది.

ADVERTISEMENT

దీనికి సంబంధించిన సమాచారాన్ని వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. మియా మాల్కోవా ‘గాడ్, సెక్స్, ట్రూత్’ చూడడానికి బాగా హెవీ ట్రాఫిక్ ఉండడం వలన అప్ గ్రేడింగ్ ఆలస్యం అవుతోందని, ఒక్కసారి అది పూర్తయిన తర్వాత తాను అప్ డేట్ చేస్తానని నెటిజన్లకు సమాచారం ఇచ్చారు వర్మ. కొద్ది గంటలు ఆలస్యం కావచ్చని చెప్పిన వర్మ, ఈ సినిమాను మంచి హెడ్ ఫోన్స్ లో గానీ, మంచి స్పీకర్స్ లో గానీ చూడమని సలహా ఇచ్చారు. ఎందుకంటే కీరవాణి అందించిన సంగీతం అంత బాగుందట!

ADVERTISEMENT
Latest Stories