90 సెకన్లలో సినిమా మొత్తం చూపించారే!

Good Luck Sakhi Trailerకీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఈ నెల 28వ తేదీన ధియేటర్లలో విడుదల కాబోతున్న “గుడ్ లక్ సఖి” సినిమా ట్రైలర్ విడుదలైంది. రెండు గంటలపైగా నిడివి ఉండే సినిమాను 90 సెకన్లలో కుదించి చెప్తే ఎలా ఉంటుందో, సరిగ్గా అలాగే ఈ సినిమా ట్రైలర్ ఉంది.

సినిమా ఓపెనింగ్ షాట్ ఎలా ఉంటుందో, అలాగే క్లైమాక్స్ ఏమిటో ఈ ట్రైలర్ లో చెప్పేసారు. గ్రామీణ ప్రాంతంలో ఆకతాయిగా తిరిగే కీర్తి సురేష్ చివరికి షూటింగ్ లో ఎలా విజయం సాధిస్తుందో చెప్పడమే ఈ కధ. ట్రైలర్ అంటే నిముషమున్నర్ర కావడంతో వినోదం పండింది.

ADVERTISEMENT

మరి ఇదే కధను రెండు గంటలు పైగా ప్రేక్షకులకు ఎంత వినోదాత్మకంగా చెప్పారనేది చూడాలి. కీర్తి సురేష్ కు ట్రైనింగ్ ఇచ్చే పాత్రలో జగపతిబాబు కనిపించగా, మరో కీలక పాత్రను ఆది పినిశెట్టి పోషించారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరో ఆకర్షణ.

కరోనా కారణంగా కలెక్షన్స్ లేకపోవడంతో ధియేటర్లన్నీ స్వచ్ఛందంగా మూసివేస్తున్న తరుణంలో విడుదలకు సిద్ధమైన “గుడ్ లక్ సఖి” సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఎంతవరకు ఉంటుందనేది వేచిచూడాల్సి విషయం. టైటిల్ లో ఉన్న ‘గుడ్ లక్’ సినిమాకు కూడా వర్తిస్తుందేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories