మీకు తెలుసా…. ‘తారక్’ అంటే ‘ముఖ్యమంత్రి’

Tarak, Tarak Chief Minister, Tarak AP Chief Minister, Tarak Andhra Pradesh Chief Minister, Jr NTR Tarak Chief Minister, Google NTR Chief Minister, Google NTR CM, Google Search NTR CM, Google Search Tarak CM, Jr.NTR Chief minister, Jr.NTR CM, Jr.NTR Mukhyamantriతెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ ను అందరూ ‘తారక్’ అని పిలుస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఈ పేరుకు అర్ధం ఏమిటో తెలుసా… బహుశా జూనియర్ ఎన్టీఆర్ కైనా తెలుసో లేదో గానీ, ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్’ ప్రకారం ‘తారక్’ పదానికి అర్ధం ‘ముఖ్యమంత్రి’ అని చెప్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇంగ్లీష్ నుండి తెలుగులోకి తర్జమా అయ్యే గూగుల్ ట్రాన్స్ లేట్ లో ‘తారక్’ అన్న పదాన్ని టైపు చేస్తే మరో వైపు ‘ముఖ్యమంత్రి’ అంటూ మొదటి ఆప్షన్ ను చూపిస్తోంది. సాధారణంగా ‘గూగుల్’ కొన్ని పదాలకు ముందుగానే అర్ధాలు పెట్టేస్తుంది. ఉదాహరణకు ‘NTR’ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ‘ఎన్టీఆర్’ అని ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అలా కొన్ని పదాలకు షార్ట్ కట్ అర్ధాలను ‘గూగుల్’ ముందుగానే లోడ్ చేసింది. అలాంటి పదాలలో ‘తారక్’ అనే పదానికి ‘ముఖ్యమంత్రి’ అని లోడ్ చేయడం విశేషం.

ADVERTISEMENT

బహుశా ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించి చరిత్ర సృష్టించిన నందమూరి తారక రామారావు అనే పేరు అంటే ముఖ్యమంత్రి మాత్రమే అని గూగుల్ కూడా భావించిందో ఏమో గానీ, అలా సెట్ అయిపోయింది. కాకపోతే, ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే… జూనియర్ ఎన్టీఆర్ కు అదే పేరు ఉండడం, జూనియర్ ను అందరూ తారక్ అని పిలవడం, గత కొన్ని సంవత్సరాలుగా జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా ఏర్పడిన భిన్న రాజకీయ కోణాల నేపధ్యంలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అలాగే ఈ అర్ధాన్ని అందించిన ‘గూగుల్’ ట్రాన్స్ లేట్ పై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ప్రాంతీయ భాషలపై పట్టులేకపోవడం వలనే ఇది జరిగిందని, ఒక్క ‘తారక్’ విషయంలోనే కాదు, అనేక పదాల తర్జమాలో నెటిజన్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయని, గతంలో కొన్ని పదాలకు సంబంధించి లీగల్ నోటీసుల వరకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ ‘తారక్’ మంత్రం ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి.Tarak, Tarak Chief Minister, Tarak AP Chief Minister, Tarak Andhra Pradesh Chief Minister, Jr NTR Tarak Chief Minister, Google NTR Chief Minister, Google NTR CM, Google Search NTR CM, Google Search Tarak CM, Jr.NTR Chief minister, Jr.NTR CM, Jr.NTR Mukhyamantri

ADVERTISEMENT
Latest Stories