కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్… ట్రోల్ షురూ..!

goutham nanda 2nd Week Collections‘రచ్చ, బెంగాల్ టైగర్’ సినిమాలతో అగ్ర హీరోలను డైరెక్ట్ చేసిన సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన “గౌతమ్ నంద” సినిమా గత వారం విడుదలై ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలను తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో… ఓపెనింగ్స్ పరంగా పర్వాలేదనిపించుకునే కల్లెక్టన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా, తొలి ఆరు రోజులకు గాను 22 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందంటూ చిత్ర యూనిట్ అధికారికంగా ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

ADVERTISEMENT

అయితే ఈ పోస్టర్ నెట్టింట ఇలా రిలీజ్ అయ్యిందో లేదో… సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభమైంది. గోపీచంద్ హీరోగా నటించిన సినిమాల కలెక్షన్స్ పైన ట్రోలింగ్ ఉంటుందా అంటే… ఇది కలెక్షన్స్ కు సంబంధించిన ట్రోల్ కాదు, సరిగ్గా ఆ పోస్టర్ ను గమనిస్తే… అందులో తారసపడే ఓ ‘స్పెల్లింగ్’ మిస్టేక్ కు సంబంధించి నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. గోపీచంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిదంటూ ఇంగ్లీష్ లో ముద్రించాల్సిన ‘బిగ్గెస్ట్’కు బదులు ‘బిగ్గెట్’ అని ముద్రించడంతో దొరికిపోయారు.

చూడడానికి, వినడానికి చిన్న స్పెల్లింగ్ తేడానే… కానీ ప్రస్తుత పరిస్థితులలో సోషల్ మీడియా జనాలు ఆడుకోవడానికి ఈ మాత్రం చాలదు… అనే విధంగా స్పందనలు వస్తున్నాయి. ‘మిస్టేక్’ కేవలం స్పెల్లింగ్ లోనేనా… లేక కలెక్షన్స్ కూడానా… అంటూ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఓ చిన్న అవకాశం లభించినా… ఆడుకోవడానికి సోషల్ మీడియా సిద్ధంగా ఉంటుందని ఈ తాజా పరిణామం చెప్పకనే చెప్తోంది.

ADVERTISEMENT
Latest Stories